SEBI : కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను..జాగ్రత్తగా వినండి
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పారంట. ఆయన చెప్పిన ఆర్థిక పాఠాలు కలకలం రేపుతున్నాయి. దీనిపై సెబీ సీరియస్ అయ్యింది.

Baba
Baba Ramdev Ruchi : ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పారంట. ఆయన చెప్పిన ఆర్థిక పాఠాలు కలకలం రేపుతున్నాయి. దీనిపై సెబీ సీరియస్ అయ్యింది. ఇటీవలే యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన వారికి ఆయన పాఠాలు చెప్పారు. మీ అందరికీ కోటీశ్వరులయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి అంటూ చెప్పారు. డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి…స్టాక్ మార్కెట్ లో లావాదేవీలు నిర్వహించేందుకు…అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి…వీటిని తిరిగి అమ్మడం, కొనడం వంటి పనులు చేయవద్దని సూచించారు. వాటిని కొన్న వెంటనే సమాధి చేయాలన్నారు. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోవాలని, పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయని చెప్పారాయన.
Read More : Drug Peddler : వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రవృత్తి “డ్రగ్స్ డాన్ యోగిత”
ఈ వ్యాఖ్యలపై సెబీ (సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) సీరియస్ అయ్యింది. సెబీ నిబంధనల ప్రకారం…సరైన నైపుణ్యం, సర్టిఫైడ్ కాని వ్యక్తుల షేర్ల కొనుగోల, అమ్మకాలకు సంబంధించిన సలహాలు ఇవ్వద్దనే నిబంధన ఉంది. అలా చేస్తే..మార్కెట్ పై అవగాహన లేని వారు డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నిబంధనలను రామ్ దేవ్ పట్టించుకోకుండా…బహిరంగంగా సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని రామ్ దేవ్ బాబాకు సూచించింది. సోయి రుచి విషయానికి వస్తే..దీనికి పతంజలి సంస్థ ప్రమోటర్ గా కొనసాగుతోంది. అదనపు నిధులు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) వెళ్లేందుకు ఆగస్టులో సెబీ నుంచి అనుమతులు తీసుకుంది.
Read More : Kangana Ranaut : నాగ చైతన్య – సమంత విడాకులు..అమీర్ ఖాన్ కారణమా ?
దీని ద్వారా..రూ. 4 వేల 300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం బాబా చేసిన కామెంట్స్ ఈ సంస్థను చిక్కుల్లో పడేసింది. రుచితో పాటు..ఎఫ్ పీవోకి మర్చంట్ బ్యాంకర్లు ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. అయితే..బాబా రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి..ఎలాంటి వీడియో లభించడం లేదు. జాతీయ మీడియాలో వార్తలు మాత్రమే వచ్చాయి. యోగా తరగతులు నిర్వహించే సమయంలో కొంతమంది వీడియో తీశారని..దీనిని సెబీకి చేరిందని..నోటీసులు వచ్చిన తర్వాత..ఆ వీడియో డిలీట్ చేశారని సమాచారం. మరి సెబీ నోటీసులకు బాబా వివరణ ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి.