Sedition Law: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. దేశద్రోహ చట్టం రద్దైపోయినట్లే, కొత్త బిల్లుల్ని ఆమోదించిన పార్లమెంట్
మూడు చట్టాలకు శుక్రవారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పై మూడు పాత చట్టా స్థానంలో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య కొత్త చట్టాల్ని తీసుకువచ్చారు

Parliament Monsoon Session: బ్రిటిషు పాలనలో చేసిన దేశద్రోహ చట్టాన్ని (ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెడ్యూర్) పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పార్లమెంటు వర్షాకల సమావేశాల చివరి రోజు సందర్భంగా శుక్రవారం ఆయన లోక్‌సభలో మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టారు. అనంతరమే ఇవి పార్లమెంట్ ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తున్నామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం సమర్పించిందని అన్నారు.
Sunil Kumar Sharma: బిహార్ నుంచి నకిలీ డిగ్రీ కొని, చైనాలో ఉన్నత చదవులు.. నేపాల్ ఎంపీ నిర్వాకం ఇది
కొన్ని దశాబ్దాలుగా దేశద్రోహ చట్టంపై చాలా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, ప్రభుత్వంలో ఉన్నవారు దీనిని ఇష్టారీతిన ప్రయోగిస్తున్నారని మండిపడుతూ దీనిని రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టం రద్దుపై ప్రభుత్వం ముందుకు రావడం గమనార్హం. దీనికి సంబంధించిన మూడు చట్టాల్ని పార్లమెంటు రద్దు చేయనుంది. మొదటిది 1860లో రూపొందించబడిన భారతీయ శిక్షాస్మృతి, రెండవది 1898లో రూపొందించబడిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మూడవది 1872లో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన భారతీయ సాక్ష్యాధారాల చట్టం.. ఈ మూడింటినీ స్థానంలో మూడు కొత్త చట్టాలు వచ్చాయి.
ఈ మూడు చట్టాలకు శుక్రవారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పై మూడు పాత చట్టా స్థానంలో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య కొత్త చట్టాల్ని తీసుకువచ్చారు. ఇక నుంచి ఈ చట్టాలే అమలులోకి వస్తాయని పార్లమెంటు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.