Covovax : సీరం ఇనిస్టిట్యూట్ లో “కోవావాక్స్” ఉత్పత్తి ప్రారంభం

పూణేలోకి సీరం ఇనిస్టిట్యూట్ లో కోవావాక్స్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మైంది.

Covovax : సీరం ఇనిస్టిట్యూట్ లో “కోవావాక్స్” ఉత్పత్తి ప్రారంభం

Sii

Covovax పూణేలోకి సీరం ఇనిస్టిట్యూట్ లో కోవావాక్స్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మైంది. ఈ మేరకు సీరం సంస్థ శుక్రవారం ఓ ట్వీట్ చేసింది. కొత్త మైలురాయిని చేరుకున్నామ‌ని, కోవావాక్స్ తొలి బ్యాచ్ టీకాల‌ను త‌మ పుణే ప్లాంట్‌ లో ఉత్ప‌త్తి ప్రారంభించిన‌ట్లు సీరం సంస్థ తన ట్వీట్ లో పేర్కొంది. 18ఏళ్ల లోపు మన భవిష్యత్తు తరాలను కాపాడే గొప్ప సామర్థం ఈ వ్యాక్సిన్ కి ఉందని సీరం సీఈవో అదార్ పూనావాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ టీకా ట్ర‌య‌ల్స్ ఇంకా జరుగుతున్నాయని పూనావాలా తెలిపారు.

కాగా,అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్‌…”కోవావాక్స్” కోవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఇప్పటివరకు జరిపిన క్లిన్ కల్ ట్రయిల్స్ లో తేలినట్లు పది రోజుల క్రితం ఆ కంపెనీ ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన కోవావాక్స్ వ్యాక్సిన్‌… కరోనా వైరస్‌ మితమైన, తీవ్రమైన కేసుల్లో 100 శాతం రక్షణ ఇస్తుందని నోవావాక్స్‌ పేర్కొంది. నోవావాక్స్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌(NVX-CoV2373) ను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాక్సిన్లను 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా,నోవావాక్స్ వ్యాక్సిన్ ను భారత్ లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది.