Maharashtra : దేవాలయంపై కూలిన భారీ వృక్షం .. ఏడుగురు భక్తులు మృతి

మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ఓ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. దేవాలయంపై చెట్టు కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Maharashtra : దేవాలయంపై కూలిన భారీ వృక్షం .. ఏడుగురు భక్తులు మృతి

deotees died tree fall on Temple

Updated On : April 10, 2023 / 9:53 AM IST

Maharashtra : మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ఓ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం భీకరగాలులతో కూడిన కురిసిన భారీ వర్షానికి బాలాపూర్ తహసీల్ లోని పరాస్ గ్రామంలోని ఓ దేవాలయంలో ఉన్న భారీ వేపచెట్టు కుప్పకూలి రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు. మరో సుమారు 30మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినివారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

అకోలా జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి బాబూజీ మహారాజ్య మందిర్ సంస్థాన్ టిన్ షెడ్ పై పక్కనే ఉన్న భారీ వేప చెట్టు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో బాబూజీ మహారాజ్ మందిర్ సంస్థాన్‌ కు వచ్చిన ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Indore Temple Stepwell Collapse : భక్తుల్ని మింగేసిన బావి .. ఇండోర్ బావి ప్రమాదంలో 35కు చేరిన మృతుల సంఖ్య

దాదపు 40 మంది షెడ్డులో గుమికూడటంతో అదే షెడ్డుపై భారీ చెట్టు కూలిపోవటంతో ఈ ప్రమాదం సంభవించిందని అకోలా జిల్లా కలెక్టర్ నీమా అరోరా తెలిపారు. నలుగురు చనిపోగా షెడ్డునుంచి 36 మందిని సజీవంగా రక్షించామని తెలిపారు.ఆ తరువాత నలుగురు చనిపోయారని తెలిపారు. అలా మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని..తీవ్రంగా గాయపడినవారిలోఓ వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉందనితెలిపారు.