దూరదర్శన్ లో శక్తి మాన్ సీరియల్ పునః ప్రసారం

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లో బోర్ కొడుతున్న వారి కోసం బాగా ఆదరణ పొందిన సీరియల్స్‌ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోంది. ఇప్పటికే రామాయణం, మహా భారతం ఎపిసోడ్స్ దూరదర్శన్ , బారతి ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి మరో వైపు ప్రైవేటు టీవీ చానల్స్ కూడా గతంలో తమ ఛానల్ లో పేరు పొందిన సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తున్నాయి. దూరదర్శన్ నేషనల్ ఛానల్ లో ప్రసారమయ్యే రామాయణం పెద్దలు మాత్రమే చూస్తుండగా…చిన్నపిల్లల కోసం శక్తిమాన్ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నారు.
శక్తిమాన్ సీరియల్ తొలిసారి 1997లో ప్రారంభమై 2005 వరకు ప్రసారమైన ఈ సీరియల్ అప్పట్లో ఎంతో ఆదరణ పొందింది. అటు ఈ సీరియల్ పునః ప్రసారంపై శక్తిమాన్ హీరో ముఖేష్ కన్నా స్పందించారు. కరోనా ఉన్న కష్ట కాలంలో ఇళ్లల్లో ఉన్న ప్రజలందరూ భారత ఇతిహాస గ్రంథమైన రామాయణం చూసే అవకాశం మరోసారి లభించింది. దీంతో పాటుగా మీ అందరికీ ఎంతో నచ్చిన శక్తిమాన్ సీరియల్ కూడా డీడీలో ప్రసారం కాబోతుంది. ఇందుకు సంతోషంగా ఉంది. అయితే శక్తిమాన్ ఏ సమయంలో ప్రసారం కాబోతుందో వేచి చూడాలన్నారు.