NCP Chief Sharad Pawar : మిత్రపక్షాల విజ్ఞప్తిని పట్టించుకోని శరద్ పవార్.. ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్న ఎన్సీపీ అధినేత

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రతిపక్షాల కూటమి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పూణేలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పవార్ వేదిక పంచుకున్నారు.

NCP Chief Sharad Pawar : మిత్రపక్షాల విజ్ఞప్తిని పట్టించుకోని శరద్ పవార్.. ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్న ఎన్సీపీ అధినేత

NCP Chief Sharad Pawar

Updated On : August 1, 2023 / 12:56 PM IST

Sharad Pawar: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా పింప్రీ చించ్‌వాడ – పూణేలను కలుపుతూ కొత్త మెట్రో రైలు మార్గాన్ని పొడిగించడం, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు చేశారు. అయితే, పూణేలో ప్రధాన మంత్రి మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆహ్వానం అందింది. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సహా పలు బీజేపీయేతర పార్టీలు ఇండియా పేరుతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్రంట్‌లో ఎన్సీపీకూడా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ను బలోపేతం చేస్తున్న సమయంలో శరద్ పవార్ ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకోవటం కొంత ఇబ్బందికరంగా ఫ్రంట్‌లోని పార్టీలు భావిస్తున్నాయి.

Sharad Pawar And Uddhav Thackeray: శివసేన చీలిన టైంలో అలా, ఎన్సీపీ చీలిన టైంలో ఇలా.. ఉద్దవ్ థాకరేకు ఒక న్యాయం, శరద్ పవార్‭కు ఒక న్యాయమా?

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ప్రధాని మోదీకి అవార్డు ప్రధానం చేసే కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొనకుండా ఉండేందుకు కాంగ్రెస్, మహారాష్ట్రలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించాయని తెలిపింది. అయితే, ఈ విషయంపై మహారాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మోహన్ జోషి మాట్లాడుతూ.. శరద్ పవార్‌ను కలిసేందుకు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం ప్రయత్నించిందని చెప్పారు. అయితే, ఆయన ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు పూణే వెళ్లారని, ఆ తరువాత మళ్లీ పవార్ అపాయింట్‌మెంట్ అడిగామని, ఇవ్వలేదని జోషి చెప్పారు.

PM Modi : ప్రధాని మోదీపై లాలూ సంచలన వ్యాఖ్యలు

శరద్ పవార్ ఎన్సీపీ పూణే జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ మాట్లాడుతూ.. ముందస్తు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సమయం లేనందున ప్రతిపక్ష పార్టీలతో పవార్ సమావేశం కాలేకపోయారని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీతో కలిసి శరద్ పవార్ వేదిక పంచుకోవడంపై శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలే స్పందించారు. తన తండ్రి నిర్ణయాన్ని సమర్ధించారు. ప్రజాస్వామ్యంలో సంభాషణ ముఖ్యమని, కాబట్టి శరద్ పవార్ మోదీతో కలిసి వేదిక పంచుకోవడంలో తప్పులేదని అన్నారు.