Sharad Pawar And Uddhav Thackeray: శివసేన చీలిన టైంలో అలా, ఎన్సీపీ చీలిన టైంలో ఇలా.. ఉద్దవ్ థాకరేకు ఒక న్యాయం, శరద్ పవార్‭కు ఒక న్యాయమా?

ఇప్పుడు అవే పరిస్థితుల్ని శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు. పార్టీ తమకే చెందుతుందని అజిత్ పవార్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఉద్దశ్ థాకరేకు సూచించినట్లుగా ఏ గుర్తు అయితే ఏముందని పవార్ అనుకోవట్లేదు. ఎన్సీపీ తమకే చెందుతుందని అంటున్నారు

Sharad Pawar And Uddhav Thackeray: శివసేన చీలిన టైంలో అలా, ఎన్సీపీ చీలిన టైంలో ఇలా.. ఉద్దవ్ థాకరేకు ఒక న్యాయం, శరద్ పవార్‭కు ఒక న్యాయమా?

Updated On : July 10, 2023 / 6:49 PM IST

Shivsena and NCP నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని శివసేన-బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మీద.. బాబాయ్ శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తమకే చెందుతుందని అజిత్ పవార్ వర్గం వాదిస్తున్న తరుణంలో పార్టీ నుంచి బయటికి వెళ్లి.. పార్టీని తమదని చెప్పుకోవడం కంటే సొంతంగా పార్టీ పెట్టుకొమ్మని సలహా ఇచ్చారు. అయితే ఇదే శరద్ పవార్.. శివసేనలో చీలిక వచ్చిన సమయంలో మరోలా స్పందించారు.

Twitter: పాకిస్తాన్ నుంచి ట్వీట్ చేస్తే, జమ్మూ కశ్మీర్ అని చూపిస్తోందట.. వివాదాస్పదంగా ట్విటర్ తీరు

అప్పుడు ఉద్దవ్ మీద మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసినప్పుడు శివసేన తమదేనని షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సమయంలో పార్టీ గుర్తులు, పేర్లు పెద్ద సమస్యేమీ కాదని, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎద్దుల బండి గుర్తు ఉండేదని అయితే గుర్తు మారిన తర్వాతే ఆ పార్టీ పుంజుకుందని చెప్పిన పవార్.. ప్రజల్లో నాయకులు బలంగా ఉన్నప్పుడు గుర్తులతో సంబంధం ఉండదని ఉద్దశ్ థాకరేకు సూచించారు. శరద్ పవార్ సూచన అనంతరం.. ఉద్ధవ్ వర్గం సైతం పార్టీ పేరు, గుర్తు మీద వివాదం తగ్గించింది.

Bengal Polls: మైత్రి చెడొద్దు, మాట పడొద్దు.. బెంగాల్ ఎన్నికల హింస నేపథ్యంలో మమతా బెనర్జీపై ఆచీతూచీ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్

ఇప్పుడు అవే పరిస్థితుల్ని శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు. పార్టీ తమకే చెందుతుందని అజిత్ పవార్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఉద్దశ్ థాకరేకు సూచించినట్లుగా ఏ గుర్తు అయితే ఏముందని పవార్ అనుకోవట్లేదు. ఎన్సీపీ తమకే చెందుతుందని అంటున్నారు. అజిత్ వర్గాన్ని వేరే పార్టీకొమ్మని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్ధవ్ వర్గం మీద తిరుగుబాటు చేసినప్పుడు షిండే వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు శరద్ పవార్ కంటే అజిత్ పవార్ వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Komatireddy Venkat Reddy : మేడమ్ కొంచెం కరుణ చూపండి.. రూ.వెయ్యి జరిమానాపై కేంద్ర ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీ లేఖ

ఒకవేళ శివసేన చీలిక సమయంలో జరిగినదానితో పోల్చిస్తే.. అప్పుడు షిండేకు శివసేన చెందినట్లే ఇప్పుడు అజిత్ పవార్‭కు ఎన్సీపీ దక్కే అవకాశాలు లేకపోలేదు. కానీ అప్పుడు చీలిక మీద మెత్తగా స్పందించిన పవార్.. ఇప్పుడు మాత్రం చీలికను విద్రోహంగా భావిస్తున్నారు. పార్టీకి చెందినవన్నీ తనకు చెందుతాయన్నట్టుగానే స్పందిస్తున్నారు.