పాట్నా సాహిబ్ బరిలో రవిశంకర్ ప్రసాద్ : కాంగ్రెస్ నుంచి శత్రుఘ్న సిన్హా పోటీ?

2019 లోక్‌సభ ఎన్నికల్లో షాట్ గన్ శత్రుఘ్న సిన్హాకు బీజేపీ మొండి చేయి చూపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. సాహిబ్ నియోజకవర్గం నుండి బీజేపీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు టికెట్ కేటాయించింది. గతంలో ఈ నియోజకవర్గం నుండే శత్రుఘ్న సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా శత్రుఘ్న బీజేపీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీనితో శతృఘ్నసిన్హా ఏం చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. శత్రుఘ్న సిన్హా మార్చి 24 లేదా 25న కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. సాహిబ్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనితో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ Vs శత్రుఘ్న సిన్హా తలపడనున్నారనమాట.
2014లో మోదీ సర్కార్‌లో శత్రుఘ్నకు పోర్టు పోలియా దక్కింది. అనంతరం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవీ నుండి తప్పించారు. ఇక అప్పటి నుండి మోడీ, బీజేపీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. అయినా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టలేదు బీజేపీ