పాకిస్థాన్‌ దురాగతం… బోర్డర్‌లో మళ్లీ దాడులు… చక్కర్లు కొట్టిన డ్రోన్లు… భారీ పేలుళ్లు

జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది.

పాకిస్థాన్‌ దురాగతం… బోర్డర్‌లో మళ్లీ దాడులు… చక్కర్లు కొట్టిన డ్రోన్లు… భారీ పేలుళ్లు

Updated On : May 10, 2025 / 9:26 PM IST

జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అటు పాకిస్థాన్, ఇటు భారత్ ప్రకటించినప్పటికీ కశ్మీర్‌ లోయలో, ఉధంపూర్‌లో మళ్లీ పాకిస్థాన్ డ్రోన్లు కనపడ్డాయి. అంతేగాక, ఆర్ఎస్‌ పురా, అఖ్నూర్, చాంబ్, భింబర్ ప్రాంతాల్లో భారీ మోటార్‌ షెల్లింగ్‌లతో దాడులు జరుపుతోంది.

పాకిస్థాన్‌ చర్యలకు దీటుగా సమాధానం ఇవ్వాలని బీఎస్‌ఎఫ్ దళాలకు కేంద్ర సర్కారు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉధంపూర్‌లో బ్లాకౌట్ విధించారు. పాకిస్థాన్‌ డ్రోన్లు దూసుకురావడంతో వాటిని భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ పేల్చేశాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. శ్రీనగర్‌లో పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయని చెప్పారు. కాల్పుల విరమణ ఏమైందని ప్రశ్నించారు. మరోవైపు, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో, బార్మెర్‌ సిటీలో పూర్తి స్థాయిలో బ్లాకౌట్ పాటిస్తున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోనూ బ్లాకౌట్ పాటిస్తుండడం గమనార్హం.