Shrikant Shinde: అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతుండగా పార్లమెంటులోనే హనుమాన్ చాలీసా చదివిన సీఎం షిండే తనయుడు
బాలాసాహెబ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే పని మేము చేసాము. అంతే కాదు కరసేవకులపై కాల్పులు జరిపిన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఈరోజు మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా చదవడం కూడా నిషేధించబడింది

Lok Sabha: పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు.. మోదీ ప్రభుత్వ లోపాలను లెక్కపెట్టుకుని విరుచుకుపడుతుండగా, మరొకవైపు అధికార ఎన్డీయే నేతలు ప్రభుత్వానికి మద్దతుగా అదే స్థాయిలో ఎదురు దాడికి దిగుతున్నారు. శివసేన ఎంపీ ఒకరు సభలో లేచి నిలబడి హనుమాన్ చాలీసా చదవడం ప్రారంభించారు. ఇది చూసి అటు అధికార పార్టీ ఎంపీలు, ఇటు విపక్ష ఎంపీలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.
Kamal Nath: 82% హిందువులున్నారు, ఇది హిందూ దేశమే.. కాంగ్రెస్ నేత కమల్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హనుమాన్ చాలీసా చదివిన ఎంపీ పేరు శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు. కళ్యాణ్ లోక్సభ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. శ్రీకాంత్ షిండేకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉద్ధవ్ థాకరే వర్గంలోని భాగమైన శివసేన మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని అన్నారు. శివసేన(యూబీటీ)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ఇక్కడ ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. ప్రజలు కూడా ఆలోచించలేదని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 13 కోట్ల మరాఠా ప్రజలను, ఓటర్లను మోసం చేశారని విమర్శించారు.
Rajasthan: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం.. మహిళలపై వేధింపులకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగం ఫట్
శ్రీకాంత్ ఇంకా మాట్లాడుతూ, “బాలాసాహెబ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే పని మేము చేసాము. అంతే కాదు కరసేవకులపై కాల్పులు జరిపిన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఈరోజు మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా చదవడం కూడా నిషేధించబడింది. హనుమాన్ చాలీసా మొత్తం నాకు తెలుసు’’ అని హనుమాన్ చాలీసా చదవడం ప్రారంభించారు. తొలుత ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. కానీ, తనను పూర్తిగా మాట్లాడనివ్వాలని సభాపతిని కోరి.. మొత్తం చాలీసా పఠించారు.