Agra : గుండెలు పిండే విషాదం.. కారులో ఊపిరాడక చనిపోయిన శునకం, వాళ్లసలు మనుషులేనా? ఏం చేసినా పాపం లేదు

Agra : ఇది అత్యంత అమానవీయ ఘటన అని, ఆ కుటుంబం తీరుపై అంతా మండిపడుతున్నారు. వాళ్లసలు మనుషులేనా? అని విరుచుకుపడుతున్నారు.

Agra : గుండెలు పిండే విషాదం.. కారులో ఊపిరాడక చనిపోయిన శునకం, వాళ్లసలు మనుషులేనా? ఏం చేసినా పాపం లేదు

Agra Pet Dog Dies (Photo : Google)

Updated On : July 4, 2023 / 12:19 AM IST

Agra – Dog Dies : ఆగ్రాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం నిర్లక్ష్యం మూగజీవి ప్రాణం తీసింది. కారులో ఊపిరాడక ఓ శునకం చనిపోయింది. హర్యానాకు చెందిన ఓ కుటుంబం తాజ్ మహల్ సందర్శనకు కారులో వచ్చింది. వారితో పాటు పెంపుడు కుక్కను సైతం తీసుకొచ్చారు. అయితే, దాన్ని కారులోనే ఉంచేసి లాక్ చేసుకుని వెళ్లిపోయారు.

డోర్లన్నీ క్లోజ్ లో ఉండటంతో ఊపిరాడక కుక్క విలవిలలాడింది. చివరికి శ్వాసం అందక చనిపోయింది. కొన్ని గంటల తర్వాత ఆ కుటుంబం తిరిగి కారు దగ్గరికి వచ్చింది. కారులో చూడగా కుక్క నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Agra)

Also Read..Robbery : అర్థరాత్రి హైవేపై ప్రయాణం చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. బెంగళూరులో వెన్నులో వణుకుపుట్టించే ఘటన

ఇది అత్యంత అమానవీయ ఘటన అని, ఆ కుటుంబం తీరుపై అంతా మండిపడుతున్నారు. వాళ్లసలు మనుషులేనా? అని విరుచుకుపడుతున్నారు. పాపం ఆ మూగజీవి ఊపిరి అందక బాధతో ఎంతగా విలవిలలాడి ఉంటుందో అని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ ప్రాణిని పొట్టన పెట్టుకున్న ఆ కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

పార్కింగ్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తాజ్ గంజ్ పోలీసులు సెక్షన్ 11 (జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం) కింద కారు యజమానిపై కేసు నమోదు చేశారు. ఆ కారు నెంబర్ ఆధారంగా యజమానిని హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆ రోజు చాలా వాతావరణం చాలా వేడిగా ఉందని స్థానికులు తెలిపారు. కారు యజమాని తన కారుని పార్కింగ్ ప్లేస్ ఉంచేసి తాజ్ మహల్ సందర్శనకు వెళ్లిపోయాడు. పోస్టుమార్టం నిమిత్తం కుక్క డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. కుక్క మరణానికి అసలు కారణం ఏంటో తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read..uttar pradesh : ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసి జేబులో వేసుకెళ్లిపోయిన భర్త

ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఐపీసీ 429 సెక్షన్ కింద కారు యజమానిపై కేసు నమోదు చేయాలి. తాజా నిబంధనల ప్రకారం.. గొలుసులతో కుక్కలను బంధించడం నేరం. ఈ ఘటనలో కుక్కను చైన్ తో బంధించడమే కాకుండా కారులో లాక్ చేయడం, అదీ మండుటెండుల్లో కారుని ఉంచడం అత్యంత దారుణమైన విషయం అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా వాహనదారులు తమ వాహనాల్లో పెంపుడు జంతువులను బంధించి ఉంటే.. అలాంటి వాహనాలను పార్కింగ్ చేయడానికి అనుమతి ఇవ్వకుండా నిబంధనలు తీసుకురావాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.