Girls Fighting : వీళ్లసలు విద్యార్థినులా? వీధి రౌడీలా? నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు, వీడియో వైరల్

Girls Fighting : అమ్మాయిలు అంటే చాలా సాఫ్ట్ గా ఉంటారనే అభిప్రాయం ఉంది. వాళ్లను పువ్వులతో పోలుస్తారు. కానీ, సీన్ మారిపోతోంది. నడిరోడ్డులో వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారు.

Girls Fighting : వీళ్లసలు విద్యార్థినులా? వీధి రౌడీలా? నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు, వీడియో వైరల్

Girls Fighting (Photo : Google)

Updated On : July 9, 2023 / 7:56 PM IST

Rajkot Girls Fighting : కాలం మారిపోతోంది. ఇన్నాళ్లూ అబ్బాయిలే అల్లర చిల్లరగా ఉంటారని, వీధుల్లో పడి కొట్టుకుంటారనే అభిప్రాయం ఉండేది. కానీ, మేము కూడా తక్కువేమీ కాదంటున్నారు అమ్మాయిలు. ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తలపడుతున్నారు. జుట్లు పట్టుకుని, దుస్తులు చింపుకుని మరీ కొట్టుకుంటున్నారు. గోర్లతో రక్కుకుంటున్నారు. పది మందిలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా పబ్లిక్ లోనే ఫైటింగ్ కు దిగుతున్నారు. బట్టలు చిరిగేలా తన్నుకుంటున్నారు.

తాజాగా గుజరాత్ రాజ్ కోట్ లో ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకుంటున్నారు. వీరి మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాహనం క్రాసింగ్ విషయంలో అమ్మాయిల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఇద్దరు అమ్మాయిలు దారుణంగా కొట్టుకున్నారు. ఓ వ్యక్తి ఇద్దరమ్మాయిలను విడదీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఓ అమ్మాయి మరో అమ్మాయిని తన గోర్లతో రక్కడం వీడియోలో ఉంది. వాళ్ల మధ్య ఘర్షణ చాలా దారుణంగా ఉంది.

Also Read..Viral Video : ఆడపిల్లల బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు..! స్కూల్ ప్రిన్సిపాల్‌‌ను పిచ్చకొట్టుడు కొట్టారు, వీడియో వైరల్

చూస్తుంటే వారు చదువుకునే అమ్మాయిల్లా ఉన్నారు. కానీ, వారు తీరు చూస్తే.. వీళ్లు విద్యార్థినులా? వీధి రౌడీలా? అనే సందేహం కలగకమానదు. అంత ఘోరంగా కొట్టుకున్నారు మరి. నడిరోడ్డుపై ఇద్దరమ్మాయిలు కొట్టుకుంటుంటే.. చుట్టూ చేరిన జనం నివ్వెరపోయారు. వారు తన్నుకునే విధానం చూసి వారి నోట మాట పడిపోయింది. వామ్మో అని ముక్కున వేలేసుకున్నారు.

Also Read..Hyderabad : హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. మద్యం మత్తులో కారుతో స్కూటర్‌ను గుద్దిపడేసిన మహిళ.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

ఓరి దేవుడా.. అమ్మాయిలేంటి మరీ ఇంత వరస్ట్ గా తయ్యారయ్యారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ లో అమ్మాయిల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మాయిలు అబ్బాయిలతో అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు. అబ్బాయిలకన్నా మేము తక్కువేమీ కాదని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇది సంతోషించాల్సిన విషయమే. కానీ, ఇలా నడిరోడ్డుపై కొట్టుకోవడంలో వీరు అబ్బాయిలనే మించిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.