NavjotSingh Sidhu : మళ్లీ కళంకిత పంజాబ్‌గా మార్చొద్దు… రాజీనామాపై సిద్దూ స్పందన

పంజాబ్ లో సమస్యలపై సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నానంటూ వివరణ ఇచ్చారు సిద్దూ. కళంకిత నాయకులు, అధికారుల వ్యవస్థ పంజాబ్ లో ఉండేదన్నారు.

NavjotSingh Sidhu : మళ్లీ కళంకిత పంజాబ్‌గా మార్చొద్దు… రాజీనామాపై సిద్దూ స్పందన

Siddhu

Updated On : September 29, 2021 / 11:36 AM IST

NavjotSingh Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నిన్న(సెప్టెంబర్ 28,2021) రాజీనామా చేసిన నవ్ జోత్ సింగ్ సిద్దూ తన నిర్ణయంపై స్పందించారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా గొడవలు లేవని చెప్పారు. జనం జీవితాలు మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి చెప్పారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. సిద్ధాంతాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు పంజాబ్ కోసం పోరాడుతానని చెప్పారు సిద్దూ.

Charanjeet Singh : పంజాబ్ కాంగ్రెస్‌‌లో సంక్షోభం, అత్యవసర కేబినెట్ భేటీ

పంజాబ్ లో సమస్యలపై సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నానంటూ వివరణ ఇచ్చారు సిద్దూ. కళంకిత నాయకులు, అధికారుల వ్యవస్థ పంజాబ్ లో ఉండేదన్నారు. మళ్లీ పంజాబ్ ను అలాంటి రాష్ట్రంగా మార్చొద్దని ఆయన అన్నారు. అలా చేస్తే రాష్ట్రానికే నష్టమన్నారు. తన సిద్ధాంతాలకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. పంజాబ్ లో ప్రభుత్వం ప్రజా సమస్యలు, ఎంచుకున్న అజెండాతో కాంప్రమైజ్ అయ్యిందని ఆరోపించారు. తాను పాటిస్తున్న ఎథిక్స్, మోరల్ అథారిటీని వదులుకోలేనని అన్నారు. 17 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరన్నారు. జనాల జీవితాలను మార్చడమే మతంగా భావిస్తున్నాని చెప్పారు సిద్దూ.

Punjab Politics : పంజాబ్ లో కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్..సిద్ధూకి సంఘీభావంగా మంత్రి రాజీనామా