Sids milk: మళ్లీ పెరిగిన సిద్స్‌ ఫార్మ్‌ పాల ధరలు

Sids milk: మళ్లీ పెరిగిన సిద్స్‌ ఫార్మ్‌ పాల ధరలు

Sids milk

Updated On : April 3, 2023 / 9:15 PM IST

Sids milk: ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌, తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిద్స్‌ ఫార్మ్‌, తమ ఏ2 గేదె పాలుm ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె (బఫెలో) పాల ధరలను స్వల్పంగా పెంచినట్లు వెల్లడించింది. ఈ నూతన ధరలు అరలీటర్‌ పౌచ్‌లకు వర్తిస్తాయి. సవరించిన ధరల ప్రకారం ఏ2 గేదె పాల ధరలు అరలీటర్‌కు 55 రూపాయలు కాగా, ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె పాల ధర ధర 44 రూపాయలుగా ఖరారు చేసింది. ఈ కంపెనీ తమ ఆవుపాలు, స్కిమ్‌ పాల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

Social Justice Meet: స్టాలిన్ ఏర్పాటు చేసిన ‘సామాజిక న్యాయం’ సమావేశం.. మోదీ వేవ్‭ని అడ్డుకుంటుందా?

ఏ2 గేదె పాల నాణ్యత భరోసా కోసం అత్యంత కఠినమైన నాణ్యతా పద్ధతులు అనుసరించాల్సి రావడం, గత ఆరు నెలలుగా ముడి పాల సేకరణ ధరలు గణనీయంగా పెరగడంకు తోడు, ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో పాల దిగుబడి 50%కు పైగా తగ్గే అవకాశాలు ఉండటం, ఉత్పత్తి వ్యయం పెరగడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని ధరల సవరణ చేసింది.

Nirmala Sitaraman: వంటగ్యాస్ ధర తగ్గించాలంటూ కేంద్ర మంత్రిని చుట్టు ముట్టిన మహిళలు

ఈ విషయమై సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకం, సంతృప్తి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నిజాయితీగా, అత్యున్నత నాణ్యత కలిగిన పాలు, పాలపదార్ధాలను వినియోగదారులకు అందించాల్సి ఉందంటూ, వ్యయం పెరిగినప్పటికీ వీలైనంతగా ఆ భారం తాము మోయడానికి ప్రయత్నించామని, తప్పనిసరి పరిస్ధితిల్లో స్వల్పంగా పెంచాల్సి ఉంటుందన్నారు.