బర్త్‌డే వేడుకల్లో ఎంపీ అత్యుత్సాహం: మోడీ ఫోటోకి పూలదండ

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 05:17 AM IST
బర్త్‌డే వేడుకల్లో ఎంపీ అత్యుత్సాహం:  మోడీ ఫోటోకి పూలదండ

Updated On : September 18, 2019 / 5:17 AM IST

ప్రధాని నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు వేడుకల్లో బీజేపీ ఎంపీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎంపీ చంద్రసేన్ జాదౌన్ ప్రధాని ఫోటోకు పూల దండ వేసి షాకిచ్చారు. 

ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని   సిర్సాగంజ్ సిటీలో ఆరోగ్య కేంద్రంలో  ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్ని బీజేపీ నేతలు..కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈవేడుకల్లో అక్కడ ఉన్న మోడీ ఫోటోకి సిర్సాగంజ్ ఎంపీ చంద్రసేన్ పూలదండ వేశారు. అది చూసిన నేతలంతా షాక్ అయ్యారు. దీంతో కొద్దిసేపటికి తేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్న చంద్రసేన్ ఫోటోకు వేసిన దండను తీసేశారు. 

ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ నేతలు అత్యుత్సాహం సంగతి తెలిసిందే..కానీ పుట్టిన రోజు వేడుకల్ని ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు.