భారత్‌లో కరోనా స్ట్రెయిన్.. హైదరాబాద్‌లో 2 కొత్త కేసులు గుర్తింపు

భారత్‌లో కరోనా స్ట్రెయిన్.. హైదరాబాద్‌లో 2 కొత్త కేసులు గుర్తింపు

Updated On : December 29, 2020 / 10:52 AM IST

Six corona new strain cases identified in India : అంతా భయపడుతున్నట్టే జరిగింది. బ్రిటన్‌ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. యూకే నుంచి వచ్చిన ఆరుగురికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2, పుణెలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.

కొత్త స్ట్రెయిన్ కేసుల నమోదుతో కేంద్రం అప్రమ్తతం అయింది. కొత్త స్ట్రెయిన్ సోకిన వారి కాంటాక్టు కోసం వేట ప్రారంభించారు. యూకే నుంచి ఎంత మంది వచ్చారు? ఎక్కడెక్కడ వారు ఉంటున్నారనే వివరాలను కేంద్రం నమోదు చేసుకుంటుంది. యూకే నుంచి తిరిగొచ్చిన 20 మంది కరోనా శాంపిల్స్ సీసీఎంబీ విశ్లేషించారు. కొత్త కరోనా సోకిన వారి కాంటాక్టుల గుర్తించారు. సాధ్యమైనంత త్వరగా అందిరినీ అధికారులు క్వారంటైన్ చేయనున్నారు.

కరోనా కొత్త స్ట్రెయిన్‌ ఇప్పటికే యూకేలో వేగంగా వ్యాపిస్తోంది. 70శాతం అధిక వేగంతో ఇది విస్తరిస్తోందని గుర్తించారు. బ్రిటన్‌ ఇప్పటికే లాక్‌డౌన్‌ విదించింది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. యూకే నుంచి పలు దేశాలు రాకపోకలను నిలిపివేశాయి.

అయితే రెండు నెలల నుంచి బ్రిటన్‌ నుంచి కొన్ని వందలమంది మన దేశంలోకి ప్రవేశించారు. వారి ద్వారా ఈ కొత్త స్ట్రెయిన్ మన దేశంలోకి వ్యాపించింది.