బిస్కెట్ అనుకుని బాంబు కొరికిన 6 ఏళ్ల బాలుడు మృతి

  • Published By: nagamani ,Published On : June 11, 2020 / 09:21 AM IST
బిస్కెట్ అనుకుని బాంబు కొరికిన 6 ఏళ్ల బాలుడు మృతి

Updated On : June 11, 2020 / 9:21 AM IST

ఆరేళ్ల చిన్నారి బాంబును చూసి అది స్వీట్ అనుకుని తినబోతుండగా ఆ చిరు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. చేపల వేటకు వాడే జిలెటిన్ స్టిక్‌ను కొరికిన విష్ణుదేవ్ అనే ఆరేళ్ల పసిబాలుడు అది పేలడంతో నెత్తురోడుతూ అక్కడికక్కడే చనిపోయాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా అలగారై గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..కావేరీ నదిలో చేపలు పట్టి జీవనాన్ని సాగించుకునే భూపతి అనే వ్యక్తి గంగాధరన్, మోహన్రాజ్, తమిళరసన్ లతో కలిసి పప్పపట్టి గ్రామంలో క్వారీలో పనిచేసే సెల్వరాజ్ అనే వ్యక్తి వద్దకు వచ్చి కావేరీనదిలో చేపలు పట్టడానికి మూడు జిలెటిన్ స్టిక్స్ తయారు కొన్నారు. వాటిలో రెండింటిని చేపలు పట్టటానికి వాడారు. మూడోది భూపతి ఇంట్లో పెట్టారు. (నీటి ప్రవాహ ప్రదేశంలో వల ఉంచడం, చేపలు పేలుడు పదార్థాలను ఉపయోగించి చేపలను భయపెట్టడానికి జిలెటిన్ స్టిక్స్ ను ఉపయోగిస్తారు)

ఈ క్రమంలో భూపతి ఆరేళ్ల కొడుకు విష్ణుదేవ్  ఆడుకుంటూ ఇంట్లో ఉన్న జిలెటిన్ స్టిక్ ను తీసుకున్నాడు. అదేదో స్వీటు అనుకుని తిందామని ఆశపడి దాన్ని కొరికాడు.దీంతో అది విష్ణుదేవ్ నోట్లోనే పేలిపోయింది. తీవ్రంగా గాయపడిన  అక్కడికక్కడే చనిపోయాడు.పేలుడు శబ్దం విని గంగాధరన్..భూపతి ఘటనాస్థలానికి వచ్చేసరికి నెత్తుటి మడుగులో పడి ఉన్న విష్ణుని హాస్పిటల్ కు తీసుకెళదామనుకున్నారు. కానీ అప్పటికే బాబు చనిపోయాడని తెలుసుకున్నారు.   

ఈ విషయం పోలీసులకు తెలిస్తే తమను ఎక్కడ కేసు పెట్టి జైల్లో వేస్తారనే భయంతో భూపతి కొడుకు అంత్యక్రియలను రాత్రికి రాత్రే పూర్తి చేసేశారు. కానీ ఈ విషయం పోలీసులకు తెలియటంతో కేసు నమోదు చేసుకుని..భూపతితో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..సెల్వరాజ్ వద్ద తాము జిలెటిన్ స్టిక్ లను కొన్నామని చెప్పారు.దీంతో పోలీసులు పరారీలో ఉన్న సెల్వరాజ్ కోసం గాలిస్తున్నారు. 

Read: పుణెలో రూ.87కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం