Smartphone : పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు

ప్రస్తుత పండుగ సీజన్ లో మొబైల్ గిరాకీ అధికంగా ఉంటుందని పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలోనే ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Smartphone : పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు

Smartphone

Updated On : September 15, 2021 / 10:28 AM IST

Smartphone : ప్రస్తుత పండుగ సీజన్ లో మొబైల్ గిరాకీ అధికంగా ఉంటుందని పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలోనే ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మొబైల్ మోడల్స్ ని బట్టి 7-10 శాతం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

Read More : Mullah Baradar: తాలిబన్ ప్రభుత్వంపై అసంతృప్తితోనే బరాదర్‌ అజ్ఞాతవాసం!

చిప్ ల కొరత అధికంగా ఉండటంతో మొబైల్, ఆటోమొబైల్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్స్ రేట్లు పెరుగుతాయని ఈ సంస్థ పరిశోధన చేసి తెలిపింది.

మరోవైపు డిస్‌ప్లే డ్రైవర్స్‌, డిస్‌ప్లే ప్యానల్‌, బ్యాటరీ వంటి కీలక విడిభాగాల కొరత మొబైల్ తయారి కంపెనీలకు తలనొప్పిగా మారింది. దీనికి తోడు రవాణా ఛార్జీలు గణనీయంగా పెరగడంతో సెల్‌ఫోన్‌ ధరలు పెరగొచ్చని విశ్లేషించింది.

Read More : Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

సరఫరా పరంగా 5జీ చిప్‌సెట్ల పరిస్థితి కొంత ఫరవాలేదని వివరించింది. చిప్ ల కొరత వలన రిలయన్స్ జియో స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణను వాయిదా వేసుకున్నట్లు గార్ట్‌నర్‌ పేర్కొంది. 2022 రెండో త్రైమాసికం వరకు చిప్ ల కొరత ఉంటుందని రియల్‌మీ తెలిపింది.