Gig workers: కేంద్రం ఐదు లక్షల బెనిఫిట్.. గిగ్ వర్కర్లు ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Gig workers
Gig workers: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతీయేటా రూ.5లక్షల వరకు గిగ్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని ప్రకటించింది. బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రయోజనాలను వేగంగా అమలు చేసేందుకు కొత్త స్కీంను కేంద్రం త్వరలోనే ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని వర్కర్లకు తాజాగా కేంద్రం సూచించింది.
ఈ-శ్రమ్ పోర్టల్ లో వర్కర్లే స్వయంగా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ప్లాట్ ఫామ్ అగ్రిగేటర్లు కూడా ఈ సమాచారాన్ని వర్కర్లకు చేరవేయాలని, వారు ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదయ్యేలా చూడాలని కోరింది. ఈ-శ్రమ్ పోర్టల్ ను ఏర్పాటు చేసి, వారి పేర్లను నమోదు చేయనున్నట్లు, అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి కోటి మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నట్లు నీతి ఆయోగ్ అంచనా వేసింది. అయితే, 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
Also Read: Women’s Day 2025 : 30 ఏళ్ల మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టాప్ 3 మెడికల్ స్క్రీనింగ్ ఇవే..!
ఇ-శ్రామ్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..
♦ అధికారిక E-Shram పోర్టల్ లోకి వెళ్లాలి.
♦ మీ ఆధార్-లింక్డ్ ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి.
♦ మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి.. అక్కడ ఇచ్చిన కాప్చర్ ను ఎంటర్ చేయాలి.
♦ రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, చిరునామా, పాన్ కార్డు, విద్య, నామినీ, బ్యాంకు వివరాలతోపాటు తదితర వివరాలను నమోదు చేయాలి.
♦ వివరాలన్నీ పూర్తి చేసిన తరువాత సబ్మిట్ పై నొక్కాలి.
♦ ఆ తరువాత మీ ఇ-శ్రామ్ కార్డ్ జనరేట్ అవుతుంది.
♦ ఈ పథకానికి 16 నుంచి 59ఏళ్ల వయస్సు కలిగిన గిగ్ వర్కర్లు అర్హులు.