Sonia Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేస్

కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి పర్సనల్ సెక్రటరీగా పనిచేసే పీపీ మాధవన్ అనే వ్యక్తిపై రేప్ కేస్ ఫైల్ అయింది. 26ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువతికి ఉద్యోగం ఇస్తానని నమ్మించి, వివాహం చేసుకుంటానని మాటిచ్చి మోసానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.

Sonia Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేస్

Rape Case

Updated On : June 28, 2022 / 6:20 AM IST

Sonia Gandhi: కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి పర్సనల్ సెక్రటరీగా పనిచేసే పీపీ మాధవన్ అనే వ్యక్తిపై రేప్ కేస్ ఫైల్ అయింది. 26ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువతికి ఉద్యోగం ఇస్తానని నమ్మించి, వివాహం చేసుకుంటానని మాటిచ్చి మోసానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.

నిందితుడు విషయాన్ని ఇతరులకు చెప్తే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు.

“ఉత్తమ నగర్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 376, 506 ప్రకారం.. జూన్ 25న కంప్లైంట్ నమోదు చేసుకున్నాం. విచారణ జరుపుతున్నాం” అని ద్వారక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం హర్ష వర్ధన్ వివరించారు.

Read Also : తుపాకీతో బెదిరించి బాలిక‌పై గ్యాంగ్ రేప్

 

ఆరోపణల నిమిత్తం 71 సంవత్సరాల పర్సనల్ సెక్రటరీపై ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని తెలిపారు. డీసీపీ పేరు బయటకు చెప్పకపోయినప్పటికీ మాధవన్ అనే వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ భర్తతో కలిసి ఢిల్లీలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పనిచేసే ఆమె భర్త 2020లో చనిపోయాడు.