Sonu Sood నేనున్నాను : ఉన్నత విద్య చదువుకొనే వారికి స్కాలర్ షిప్..ఎవరు అర్హులు

sonusood scholarship : నటుడు సోనూసూద్ దాతృత్వం నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఎవరికీ ఏ ఆపద వచ్చినా సరే.. నేనున్నానంటూ అభయహస్తం ఇస్తున్నాడు. వాళ్లూ వీళ్లు వచ్చి కష్టం చెప్పుకోవడం కాదూ.. తానే స్వయంగా ఎదుటివాళ్ల సమస్యల్ని తెలుసుకుని సాయం చేస్తున్నాడు.
లెటెస్ట్‌గా మరోసారి తన గొప్ప గుణాన్ని చాటుకున్నాడు. తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించడానికి చాలా మంది పడుతున్న ఇబ్బందులను సోనూ గమనించాడు. దీంతో వాళ్లని ఆదుకునేందుకు రంగంలోకి దిగాడు.
ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను సోనూ క్రియేట్ చేశాడు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని ప్రకటించాడు.
https://10tv.in/businessman-ordes-for-liquor-online-gets-cheated-of-rs-1-6-lakh-instead/
వార్షికాదాయం 2 లక్షల రూపాయల లోపు ఉన్న కుటుంబాలకు చెందిన, మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ ఈ స్కాలర్‌షిప్‌నకు అప్లై చేసుకునే అవకాశం కల్పించాడు.
మెడిసిన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్, జర్నలిజమ్ లాంటి కోర్సులు చదువుతున్న వాళ్లందరూ దీనికి అర్హులేనని సోనూ ప్రకటించాడు. అప్లయ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఒక మెయిల్ ఐడీ క్రియెట్ చేశాడు. పది రోజుల్లోగా అప్లై చేసుకొవాలని సూచించాడు సోనూసుద్.