Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారిన కర్ణాటక.. పార్లమెంటుకు సోనియా వెళ్లేది అక్కడి నుంచేనట!

ఇటీవలి కాలంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల నుంచి బహిష్కరించబడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వాయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో 12, తుగ్లక్ రోడ్ లో ఉన్న తన అధికారిక నివాసాన్ని రాహుల్ ఖాళీ చేశారు.

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారిన కర్ణాటక.. పార్లమెంటుకు సోనియా వెళ్లేది అక్కడి నుంచేనట!

sonia gandhi

Updated On : July 21, 2023 / 7:33 PM IST

Rajya Sabha: కర్ణాటలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. కీలక నిర్ణయాలన్నీ కర్ణాటక నుంచే తీసుకుంటోంది. వాస్తవానికి సెంటిమెంటు పక్కన పెడితే రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. కొద్ది రోజుల క్రితమే విపక్ష పార్టీల మెగా సమావేశానికి కర్ణాటకను ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆ రాష్ట్రం నుంచే రాజ్యసభకు వెళ్లనున్నారట.

Jagan Comments On Pawan Kalyan : తనది ప్రత్యేక పార్టీ అనేది ఓ డ్రామా.. పవన్‌పై సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉంది. అయితే సయ్యద్ నసీర్ హుస్సేన్, సుప్రియా శ్రీనాత్‭లతో పాటు సోనియా గాంధీని ఇక్కడి నుంచే నామినీ చేయొచ్చంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జీసీ చంద్రశేఖర్, సయ్యద్ నసీర్ హుస్సేన్, డాక్టర్ ఎల్ హనుమంతయ్య(ఆల్ కాంగ్రెస్), రాజీవ్ చంద్రశేఖర్ పదవీకాలం ఏప్రిల్ 2, 2024తో ముగుస్తుంది. ప్రస్తుత బలం ప్రకారం, కాంగ్రెస్ నాలుగు స్థానాలకు మూడు సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అనుబంధంగా ఉన్న ఏఐసీసీ కోఆర్డినేటర్ నసీర్‌కు మరోసారి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా, సోనియాతో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్, అధికార ప్రతినిధి శ్రీనాత్‭లను ఇక్కడి నుంచే ఎగువ సభకు పంపనున్నట్లు సమాచారం.

JDS – BJP Alliance: నిన్న బీజేపీని కొట్టడానికి కాంగ్రెస్‭తో చెలిమి.. నేడు కాంగ్రెస్‭ను ఓడించడానికి బీజేపీతో దోస్తీ.. పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కుమారస్వామి

సోనియా ఇటీవల బెంగళూరు పర్యటన సందర్భంగా సోనియాకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీట్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై సోనియా స్పందించకపోయినప్పటికీ ఆమె ఎగువ సభలోకి ప్రవేశించే అవకాశాలను సూచిస్తున్నాయి. ప్రధానంగా సిద్ధరామయ్య ఆఫర్‌ను సోనియా అంగీకరించినట్లయితే.. 1989లో రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఆమె నివసిస్తున్న 10, జన్‌పథ్ ఇంటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది.

Tata Altroz : అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో టాటా ఆల్ట్రోజ్ 2 కొత్త వేరియంట్‌లు..!

ఇటీవలి కాలంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల నుంచి బహిష్కరించబడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వాయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో 12, తుగ్లక్ రోడ్ లో ఉన్న తన అధికారిక నివాసాన్ని రాహుల్ ఖాళీ చేశారు. ఇక 34, లోధి ఎస్టేట్ నివాసాన్ని భద్రతా కారణాల వల్ల జూలై 2022లో ప్రియాంక ఖాళీ చేశారు.

Minister KTR : మోదీ స‌ర్కార్ తెలంగాణ‌కు న‌యా పైసా ఇవ్వ‌లేదు.. విభ‌జ‌న చ‌ట్టంలోని ఒక్క హామీని నెర‌వేర్చ‌లేదు : మంత్రి కేటీఆర్

సోనియా లోక్‌సభకు ఐదుసార్లు ఎంపికయ్యారు. ఒకసారి అమేథీ, నాలుగు సార్లు రాయ్‌బరేలీ నుంచి గెలిచారు. ఎన్నికల్లో ఆమె ఎప్పుడూ ఓడిపోని రికార్డును కలిగి ఉన్నారు. అయితే 2019 తర్వాత ఆనారోగ్యం, అనేక ఇతర కారణాల వల్ల సోనియా తన నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో సోనియాను రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు పంపేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది.