Monsoon Heavy Rains : దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Heavy Rains (5)
Southwest Monsoon Spread : దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రుతపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. 1961 తర్వాత తొలిసారి ఢిల్లీ, ముంబైలను నైరుతి రుతుపవనాలు ఏకకాలంలో తాకాయి.
Telangana Rain : ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో.. రానున్న రెండు రోజులు తెలంగాణలో వర్షాలు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
భారత వాతావరణ శాఖ ముంబైలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ముంబైలో 6 గంటల్లో 74 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.