Delhi Rains : జీ 20 సదస్సు వేళ ఢిల్లీలో వర్షాలు…అప్రమత్తమైన అధికారులు
జి20 సదస్సుకు ముందు శనివారం ఢిల్లీలో వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. రానున్న రెండు,మూడు రోజుల్లో బలమైన గాలులు, తేలికపాటి వర్షాలు కురవవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....

Delhi Rains
Delhi Rains : జి20 సదస్సుకు ముందు శనివారం ఢిల్లీలో వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. (G20 Summit 2023) వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. రానున్న రెండు,మూడు రోజుల్లో బలమైన గాలులు, తేలికపాటి వర్షాలు కురవవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. (Spell Of Rain Cools City As Delhi) శనివారం మెగా జీ20 సమ్మిట్‌కు ఢిల్లీ సన్నద్ధమవుతున్న తరుణంలో కురుస్తున్న వర్షం ఢిల్లీ నగరాన్ని చల్లబర్చింది. (Mega G20 Summit)
G20 Summit 2023 : మోదీ, జోబిడెన్ ద్వైపాక్షిక సమావేశంలో ఏఐ, సైన్స్, డిఫెన్స్ అంశాలపై చర్చ
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేడు, రేపు మధ్యాహ్నానికి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షం కురిసింది. నైరుతి ఢిల్లీలోని వసంత్ కుంజ్, మునిర్కా, నరేలా ప్రాంతాలతో సహా ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది.
Morocco : మొరాకోలో భారీభూకంపం…93 మంది మృతి
తెల్లవారుజామున కురిసిన వర్షం ఢిల్లీని అతలాకుతలం చేసింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల నేపథ్యంలో ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.