స్పైస్ జెట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారు: ప్రగ్యా సింగ్ ఠాకూర్

స్పైస్ జెట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారు: ప్రగ్యా సింగ్ ఠాకూర్

Updated On : December 22, 2019 / 8:08 AM IST

బీజేపీ భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్పైస్ జెట్ ఎయిర్‌వేస్‌పై కంప్లైంట్ చేశారు. ఎయిర్‌లైన్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని అంతేగాక తాను బుక్ చేసుకున్న సీట్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదుచేశారు. శనివారం భోపాల్ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్‌కు తన కంప్లైంట్ అందజేశారు. 

‘నాతో స్పైస్ జెట్ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని అధికారులకు చెప్పాను. ఈ ఘటన జరిగిన తర్వాత నేను బుక్ చేసుకున్న సీట్ కూడా నాకు ఇవ్వలేదు’ అని జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆమె కంప్లైంట్‌పై ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ అనిల్ విక్రమ్ స్పందించి 
విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. 

ఎంపీతో జరిగిన ఘటన గురించి స్పైస్ జెట్, ఇతర సిబ్బందిని అడుగుతున్నాం. ఎందుకంటే స్పైస్ జెట్‌ ఇటువంటి విషయాల్లో సొంతగా పెట్టుకున్న కొన్ని నియమాలు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది’ అని బదులిచ్చారు. స్పైస్ జెట్ దీనిపై ఏ రకంగా స్పందించలేదు. 

బీజేపీ ఎంపీ వార్తల్లో ఉండటం కొత్తేం కాదు. ఇటీవల నాథురామ్ గాడ్సేను లోక్ సభలో పొగిడి వివాదాల్లో చిక్కుకుంది. ఆ తర్వాత బీజేపీ సంబంధిత కమిటీ నుంచి తొలగించింది. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లకు మాత్రం రావొచ్చని తెలిపింది. ఈ విషయంలో సభలో రెండు సార్లు క్షమాపణ చెప్పుకుంది. తాను గాడ్సేకు అనుకూలంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చుకుంది.