Karnataka High Court : అలా చేస్తే హత్యాయత్నం కాదు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

2010లో చిక్ మంగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని ముగలికట్టెలో నరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఇతర గ్రామస్తులతో కలిసి ఓంకారప్ప అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా పరమేశ్వరప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.

Karnataka High Court : అలా చేస్తే హత్యాయత్నం కాదు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

Karnataka High Court

Updated On : June 27, 2023 / 11:26 AM IST

Squeezing Of Testicles : కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొట్లాటలో ఒక వ్యక్తి మరో వ్యక్తి వృషణాలను పిసకడాన్నిహత్యాయత్నంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని హత్యాయత్నం నేరంగా పరిగణిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుతో హైకోర్టు విభేదించింది. నిందితుడు బాధితుడిని చంపాలనే ఉద్దేశంతో ఆ నేరానికి పాల్పడలేదు కాబట్టి ఆ చర్యను హత్యాయత్నంగా భావించలేమని తెలిపింది.

ఈ మేరకు నిందితుడికి కింద కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను మూడేళ్లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2010లో చిక్ మంగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని ముగలికట్టెలో నరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఇతర గ్రామస్తులతో కలిసి ఓంకారప్ప అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా పరమేశ్వరప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.

Kashmir Mosque : కశ్మీర్ లో మసీదులో ముస్లింలతో జై శ్రీరాం నినాదాలు!

ఓంకారప్పతో గొడవకు దిగాడు. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పరమేశ్వరప్ప.. ఓంకారప్ప వృషణాలను బలంగా పిసికాడు. దీంతో ఓంకారప్ప నొప్పితో విలవిలలాడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వృషణాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పి వాటిని పూర్తిగా తొలగించారు.

దీనిపై బాధితుడు ఓంకారప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు పరమేశ్వరప్పపై హత్యాయత్నం అభియోగాలు మోపి చిక్ మంగళూరు ట్రయల్ కోర్టులో హాజరు పర్చారు. 2012లో కోర్టు పరమేశ్వరప్పకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో నిందితుడు పరమేశ్వరప్ప ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

US condemned Harassment of Journalists : జర్నలిస్టుపై వేధింపులను ఖండించిన వైట్‌హౌస్

తనకు ఓంకారప్పను చంపాలనే ఉద్దేశం లేదని, కొట్లాటలో అనుకోకుండా అలా చేయాల్సి వచ్చిందని పరమేశ్వరప్ప పేర్కొన్నారు. ఈ కేసులో పలుమార్లు విచారణ అనంతరం తాజాగా కర్ణాటక హైకోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడు పరమేశ్వరప్ప ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడలేదంటూ హత్యాయత్నం అభియోగాలను రద్దు చేసి, జైలు శిక్షను మూడేళ్లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.