KL Rahul : తండ్రి అయిన టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్..
రాహుల్, అతియా శెట్టి 2023 జనవరిలో వివాహం చేసుకున్నారు.

KL Rahul : టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. అతడి భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ కారణంగానే ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ కు రాహుల్ దూరమైయ్యాడు. రాహుల్ కు తోటి క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను ఢిల్లీ రూ.14 కోట్లకు వేలంలో దక్కించుకుంది. రాహుల్, అతియా శెట్టి 2023 జనవరిలో వివాహం చేసుకున్నారు.
Also Read : ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కొత్త కుర్రాడు.. ఎవరు ఇతడు? ఓపెనర్ వికెట్‌నే తీసి పడేశాడు..
అతియా శెట్టి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలియగానే బాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. వెటరన్ యాక్టర్ సునీల్ శెట్టి కూతురే అతియా శెట్టి. తాను తాత కావడం సంతోషంగా ఉందన్నార సునీల్ శెట్టి. అదితి రావ్ హైదరి, కియారా అద్వానీ, అర్జున్ కపూర్, మృణాల్ ఠాకూర్, పరిణితి చోప్రా, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, మలైకా అరోరా, టైగర్ ష్రాఫ్ తదితరులు కేఎల్ రాహుల్, అతియాకు కంగ్రాట్స్ చెప్పారు.