Stars On Packets : ఇకనుంచి ఉత్పత్తులపై స్టార్ రేటింగ్..ఆరోగ్యమైనదో..కాదో ఫుడ్ ప్యాకెట్ ను చూసి తెలుసుకోవచ్చు!

ఇకనుంచి ప్యాకెట్స్ లో ఉత్పత్తులు ఆరోగ్యకరమో, కాదో ఫుడ్ ప్యాకెట్ పై ఉండే స్టార్స్ ను బట్టి తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు ఆహార భద్రత, ప్రమాణాల మండలి అధికారులు.

Stars On Packets : ఇకనుంచి ఉత్పత్తులపై స్టార్ రేటింగ్..ఆరోగ్యమైనదో..కాదో ఫుడ్ ప్యాకెట్ ను చూసి తెలుసుకోవచ్చు!

Packaged Foods To Soon Have A 'health Star'

Updated On : February 25, 2022 / 4:39 PM IST

Packaged foods to soon have a ‘Health Star’ : ప్యాక్ చేసిన ప్యాకెట్స్ లో ఉన్న ఆహారాలు, ఆహార పదార్ధాలు ఆరోగ్యారికి మంచివో లేకా హాని చేసేవో ఎలా తెలుస్తుంది?ప్యాకెట్ కొని విప్పి అది తిన్నాక ఏదన్నా అనారోగ్య సమస్య వస్తేనే గానీ ఆ ప్యాకెట్ లోని పదార్ధం హానికరమైనది అని తెలియదు. కానీ ఇకనుంచి అలా కాదు. ప్యాకెట్స్ లో ‘స్టార్స్’ ఆ ప్యాకెట్ లోని ఉండే ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివో కావు చెబుతాయి. అంటే ‘హెల్త్ స్టార్స్’ మనకు ప్యాకెట్ లోని ఉత్పత్తుల గురించి సమాచారం చెబుతాయన్నమాట. అంటే ప్యాకెట్స్ పై ఎన్ని స్టార్స్ ఉంటే అన్ని ఆరోగ్యకరమైనదని అర్థం అని తెలుసుకోవచ్చంటున్నారు అధికారులు.

Also read : Old Age : వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం… ఆహార నియామాలు

మారిన జీవనశైలిలో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు నోరు ఊరిస్తుంటాయి. రంగు రంగులో తినాలనిపించేలా ఉంటాయి. బిజి బిజీ జీవితాలు..వండుకుంటేనే గానీ తినాలి అని అనికాకుండా కోరింది వెంటనే తినే అవకాశాలు వచ్చేశాయి నేటి ప్యాకేజ్ ఫుడ్స్ అందుబాటులోకి వచ్చాక.ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ వినియోగం పెరిగిపోయింది. అవన్నీ కూడా ప్రాసెస్ చేసినవి. నిల్వ ఉండేందుకు వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. వాటిలో ఎన్నో రకాల కెమికల్స్ కూడా ఉంటాయి. అవి ఆరోగ్యంపై ప్రభావాన్ని వెంటనే కాకపోయినా తరుచు తింటే కచ్చితంగా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. కానీ..చాలా మందికి వీటి గురించి అవగాహన లేదు. కానీ..ఇకపై అటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్యాకెట్స్ పై ఉండే ‘హెల్త్ స్టార్స్’ ను బట్టి ఆ ప్యాకెట్ లో ఉన్న ఉత్పత్తి ఎంత ఆరోగ్యకరమో తెలియనుంది ఇకపై.

Also read :  Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలకు దూరంగా!…

వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఆహార ఉత్పత్తి ఆరోగ్యానికి మంచిదా, కాదా? అన్న విషయాన్ని సులభంగా గుర్తించేందుకు ఇకనుంచి స్టార్ రేటింగ్ రానుంది. మన ఇంట్లో రిఫ్రిజిరేటర్, ఏసీని గమనించండి. వాటిపై స్టార్ రేటింగ్ కనిపిస్తుంది. 5 స్టార్ ఉంటే విద్యుత్ ఆదా ఎక్కువ చేస్తుందని అర్థం. ఈ విషయం చాలా మందికి తెలుసు. అలా ఒక్కోస్టార్ తగ్గుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్ రేటింగ్ ను భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) అమలు చేస్తోంది.

అచ్చంగా అటువంటిదే ఇప్పుడు ఆహార ఉత్పత్తులకు హెల్త్ స్టార్ రేటింగ్ ను ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అమల్లోకి తీసుకురానుంది. సదరు ఉత్పత్తిపై ఎన్ని స్టార్స్ ఉంటే అంత మంచిదని అర్థం చేసుకోవచ్చు. కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమాణం ఆధారంగా స్టార్ రేటింగ్ ఉంటుంది.

Also read : Reheat Foods : ఈ ఐదు ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేయొద్దు…ఎందుకంటే?…

‘‘వినియోగదారులు ఆహారోత్పత్తిలోని పోషకాల గురించి ఈజీగా తెలుసుకోవటానికి ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ ఒక అధ్యయనం నిర్వహించింది. స్టార్ రేటింగ్, ట్రాఫిక్ లైట్ సంకేతాలు, న్యూట్రిషన్ స్కోరు, హెచ్చరిక గుర్తులను పరిశీలించింది. వినియోగదారులు సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా స్టార్ రేటింగ్ ను సూచించింది’’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో అరుణ్ సింఘాల్ తెలిపారు.