Statue of Equality: ముచ్చింతల్‌లో ప్రధాని పర్యటన వివరాలు

ప్రధాని నరేంద్ర మోదీ.. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన సాయంత్రం శ్రీరామ నగరంలో

Statue of Equality: ముచ్చింతల్‌లో ప్రధాని పర్యటన వివరాలు

Modi

Updated On : February 5, 2022 / 5:01 PM IST

Statue of Equality: ప్రధాని నరేంద్ర మోదీ.. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన సాయంత్రం శ్రీరామ నగరంలో పర్యటించనున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్యటన ఇలా జరగనుంది.

* సాయంత్రం 5గంటలకు ఆశ్రమంలోని అతిథి గృహానికి చేరుకుంటారు.

* 5.15 కు ప్రధాన యాగశాలను సందర్శిస్తారు.

* 5.30కి గంటలకు విశ్వక్షేనేష్టి యాగంలో పాల్గొంటారు.

* 6.20కి దివ్య దేశాలను సందర్శిస్తారు.

* 6.30కి శ్రీ రామానుజ సువర్ణ మూర్తిని సందర్శిస్తారు.

* 7 గంటలకు శ్రీ రామనుజాచార్యుల మూర్తిని ఆవిష్కరిస్తారు.

* 7.30కి 3డి మ్యాపింగ్ లేజర్ షో తిలకించనున్నారు.

* 7.55 కు పూర్ణాహుతి కార్యక్తమంలో పాల్గొంటారు.

Read Also : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ సక్సెస్ : ప్రధాని మోదీ

* దాదాపు 3 గంటలపాటు సమతామూర్తి కేంద్రంలోనే మోదీ పర్యటన కొనసాగనుంది.

* 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించి భద్రవేది మొదటి అంతస్తులో ఉన్న రామానుజచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని తిలకిస్తారు.

* శ్రీరామానుజచార్యుల విశిష్టతపై 30నిమిషాల పాటు ప్రధాని ప్రసంగం జరుగుతుంది.

* రాత్రి 8:05 నిమిషాలకు మచ్చింతల్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళతారు.

పర్యటన సందర్భంగా చేసిన ట్వీట్ లో.. ‘పవిత్రమైన ఆలోచనలు, బోధనల ద్వారా మనకు స్పూర్తి నిచ్చిన శ్రీరామానుజాచార్యకు ఇది సముచితమైన నివాళి’ అని పోస్టు చేశారు.