కోల్ కతాలో బీజేపీ ర్యాలీపై రాళ్ల దాడి

Stones pelted at BJP roadshow in Kolkata కోల్ కతా లో సోమవారం బీజేపీ నిర్వహించిన “పరిబర్తన్ యాత్రాస్” ర్యాలీపై కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిసేపటికే.. ఈ పరిస్థితి ఏర్పడింది. బీజేపీలో చేరిన సువెందు అధికారి ఆధ్వర్యంలో పార్టీ రోడ్ షో నిర్వహించగా ..టీఎంసీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు గో గ్యాక్ నినాదాలు చేస్తూ నల్ల జెండాలు చూపి రాళ్లు విసిరారు. బీజేపీ ర్యాలీలో కేంద్రమంత్రి దేబశ్రీ చౌదరి,రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కూడా పాల్గొన్నారు. ఆగంతకులు రాళ్లు రువ్వడంతో బీజేపీ కార్యకర్తలు వారిని వెంబడించారు.
ఈ ఘటనతో నేతల రోడ్ షో అభాసు పాలయింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు ఉండగానే పరిస్థితి ఇలా ఉండగా ఇక ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్ పై టీఎంసీ కారకర్తలుగా భావిస్తున్నవారు రాళ్ల దాడికి పాల్పడడంతో అప్పటి నుంచి రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు, ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో ఉన్నకోల్‌కతాలోని ముదియాలి ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను నియమించారు.
కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 స్థానాల్లో 18 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. ఇక,ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే తీరాలన్న కసితో మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తోంది. ఇక,కమ్యూనిస్టులు-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కలిసి పోటీకి దిగనున్నాయి.
#WATCH | West Bengal: Stones were pelted at BJP workers who were part of a rally attended by Union Minister Debasree Chaudhuri, state BJP chief Dilip Ghosh and Suvendu Adhikari in Kolkata earlier today. pic.twitter.com/hLW8NEmWeX
— ANI (@ANI) January 18, 2021