Stray Dogs : చెప్పులు ఎత్తుకెళ్లాయని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిన మాజీ మేయర్
ఇంట్లోనే విడిచిన ఆయన చెప్పులు కనిపించకుండాపోయాయని అధికారులకు ఫిర్యాదు చేశారు మాజీ మేయర్. దీంతో మున్సిపల్ అధికారులు రగంలోకి దిగారు. ఏకంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేశారు.

Aurangabad Stray dogs sterilized
Aurangabad Stray dogs sterilized : ఆయనో మాజీ మేయర్. పేరు నంద కుమార్ హోడెలే (Nandkumar Ghodele). మహారాష్ట్ర (Maharashtra)లోని ఔరంగాబాద్ (Aurangabad)నగరంలోని నక్షత్రావాడీ ప్రాంతంలో నివాసముంటున్నారు. ఈక్రమంలో గత సోమవారం (జూన్12,2023) ఇంట్లోనే విడిచిన ఆయన చెప్పులు కనిపించకుండాపోవటంతో అసహనానికి గురి అయ్యారు.
ఇల్లంతా వెదికినా చెప్పులు కనిపించిలేదు. దీంతో ఉగ్రుడైపోయాడు. చూస్తే ఇంటి గేటు తీసి ఉంది. వీధిలో కొన్ని వీధి కుక్కలు (Stray dogs) కనిపించాయి. ఆకుక్కలే తన చెప్పులు ఎత్తుకెళ్లిపోయాయని భావించాడు. సాధారణంగా అదే జరిగితే ఎవరైనా చెప్పులు ఎత్తుకెళ్లిన కుక్కలు ఈ పరిసరాల్లో ఎక్కడన్నా వదిలేసాయేమోనని వెదుక్కుంటాం అవి ఖరీదైన చెప్పులైతే. లేదా లైట్ తీసుకుంటాం.
Bengaluru : 30 బీపీ ట్యాబ్లెట్లు మింగించి .. తల్లిని చంపిన మహిళ కేసులో సంచలన విషయాలు
కానీ ఆ మాజీ మేయర్ మాత్రం ఏకంగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీధికుక్కలు తన చెప్పులు ఎత్తుకెళ్లిపోయాయని. దీంతో కుక్కల్ని పట్టుకోవటానికి మున్సిపల్ సిబ్బంది (AMC) రంగంలోకి దిగారు. అలా పట్టుకున్న కొన్ని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (vasectomy)కూడా చేశారు. మేయర్ నివాసానికి సమీపంలో పట్టుబడ్డ నాలుగు వీధి కుక్కలకు అధికారులు స్టెరిలైజేషన్ (sterilized) చేశారు.
ఈ విషయంపై ఓ మున్సిపల్ అధికారి మాట్లాడుతు..వీధి కుక్కల సమస్య గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇలా చేయటం మామూలేనని తెలిపారు. కానీ ఈ విషయంపై స్పందించటానికి సదరు మాజీ మేయర్ మాత్రం అందుబాటులో లేరు. ఆ తరువాత ఆయన్ని ప్రశ్నించినా ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించారని సమాచారం.