Preeti Shenoy : కాంపిటేషన్ ఉంది.. కవిత రాసిస్తారా? రచయిత ప్రీతీ షెనాయ్‌కి 10వ తరగతి విద్యార్ధి ట్వీట్
సెలబ్రిటీలకు కొందరి నుంచి విచిత్రమైన ట్వీట్లు , వింత అభ్యర్ధనలు వస్తుంటాయి. తాజాగా రచయిత ప్రీతీ షెనాయ్‌కి 10 తరగతి విద్యార్ధి నుంచి వచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Preeti Shenoy
Preeti Shenoy : కొంతమంది ప్రముఖులకు వచ్చే ట్వీట్లు విచిత్రంగా.. నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. కొన్ని విచిత్రమైన రిక్వెస్ట్‌లు కూడా వస్తుంటాయి. కొన్ని సామాజిక అంశాలపై సెలబ్రిటీలు సహజంగానే స్పందిస్తుంటారు. అయితే ఓ పదవ తరగతి విద్యార్ధి నుంచి రచయిత్రి ప్రీతీ షెనాయ్ ట్వీట్ వచ్చింది. కవితల పోటీకి వెళ్లేందుకు కొన్ని లైన్స్ కవిత రాసివ్వమని. ఈ ట్వీట్ నెటిజన్లకు నవ్వు తెప్పించింది.
Jithender Reddy : దున్నపోతు ట్రీట్‌మెంట్ అంటూ ట్వీట్ చేసిన మాజీ ఎంపీ .. బీజేపీలో పెను దుమారం
సోషల్ మీడియాలో పెట్టే కొన్ని ట్వీట్లు వింతగా ఉంటాయి. ఎలాగైనా వారి నుంచి రిప్లై రాబట్టాలనుకుంటారో? లేక నిజంగానే అమాయకంగా కొన్ని ట్వీట్లు పెడుతుంటారో అర్ధం కాదు. రచయిత్రి ప్రీతీ షెనాయ్ ఒక పోస్ట్‌ను అందరితో పంచుకున్నారు. అందులో ఓ స్కూల్ విద్యార్ధి తనకు కవితల పోటీ ఉందని దయచేసి 10 లైన్ల కవిత రాసిపెట్టమని రిక్వెస్ట్ చేయడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక ఈ పోస్ట్‌ను ప్రీతీ షెనాయ్ తన ట్విట్టర్ ఖాతాలో (@preetishenoy) పోస్ట్ చేశారు. తాను రాసి పెట్టలేనని ఆ విద్యార్ధికి ఆమె రిప్లై చేశారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఈ విచిత్రమైన అభ్యర్థన చూసి ప్రజలు చాలా అవాక్కయ్యారు. కొంతమంది విద్యార్ధి రిక్వెస్ట్‌ను స్వీట్‌గా భావించగా, మరికొందరు విద్యార్థి యొక్క ధైర్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ స్టూడెంట్ చాట్‌జీపీటీ సహాయం తీసుకుని ఉండాల్సింది అని కూడా కొందరు సలహా ఇచ్చారు.
And look at this message I received just now ! A kid wants me to do their homework for them! ??♀️??♀️??♀️ pic.twitter.com/T6yv6dE8N4
— Preeti Shenoy (@preetishenoy) June 29, 2023