పరీక్షల్లో ‘పబ్‌జీ’ గేమ్‌ గురించి రాసిన ఇంటర్ విద్యార్థి

ఓ ఇంటర్‌ విద్యార్థి పరీక్షల్లో పబ్‌జీ గేమ్‌ గురించి రాసి ఫెయిల్‌ అయ్యాడు.

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 03:02 AM IST
పరీక్షల్లో ‘పబ్‌జీ’ గేమ్‌ గురించి రాసిన ఇంటర్ విద్యార్థి

Updated On : March 22, 2019 / 3:02 AM IST

ఓ ఇంటర్‌ విద్యార్థి పరీక్షల్లో పబ్‌జీ గేమ్‌ గురించి రాసి ఫెయిల్‌ అయ్యాడు.

ఓ ఇంటర్‌ విద్యార్థి పరీక్షల్లో పబ్‌జీ గేమ్‌ గురించి రాసి ఫెయిల్‌ అయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 73 శాతం మార్కులతో పాసైన ఓ విద్యార్థి గదగ్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌లో చేరాడు. స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి ‘పబ్‌జీ’ గేమ్‌ ఆడటంతో అతనికి చదువుపై ఆసక్తి సన్నగిల్లింది.  కళాశాల నుంచి వచ్చాక స్మార్ట్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతూ గడిపేసేవాడు. ఏం చేస్తున్నావని తల్లిదండ్రులు అడిగితే.. ‘స్నేహితుల దగ్గర సబ్జెక్టుల గురించి చాట్‌ చేస్తున్నా’ అని సమాధానం ఇచ్చేవాడు.
Read Also : షాకిచ్చిన ఫేస్ బుక్: యూజర్ల పాస్ వర్డ్ మాకు తెలుసు

చివరికి పరీక్షలు మరో 15 రోజులు ఉన్నాయనగా, పబ్‌జీ ఆడటం ఆపేశాడు. దీంతో చదువుపై ఏకాగ్రత కుదరలేదు. తీరా పరీక్ష హాల్‌లోకి వెళ్లాక.. ఇన్విజిలేటర్లు ఎకనామిక్స్‌ ప్రశ్నపత్రాన్ని అందించారు. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడంతో పబ్‌జీ గేమ్‌ ఎలా ఆడాలి? ఎలా ఆడితే గెలుస్తాం? అని సవివరంగా వ్యాసాలు రాశాడు. దీంతో ఇటీవల వెలువడ్డ పరీక్షా ఫలితాల్లో అతను ఫెయిల్‌ అయ్యాడు.
Read Also : చావుతో ఆటలు : PubG ఆడుతూ నరాలు పట్టేసి.. చనిపోయాడు