Mamata Banerjee: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో మమత బెనర్జీకి నిరసన సెగ.. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు

శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్ లో చేదు అనుభవం ఎదురైంది. లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆమె ప్రసంగిస్తున్న సమయంలో

Mamata Banerjee: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో మమత బెనర్జీకి నిరసన సెగ.. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు

Mamata Banerjee

Updated On : March 28, 2025 / 2:30 PM IST

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్ లో చేదు అనుభవం ఎదురైంది. లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆమె ప్రసంగిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు అడ్డుకున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని కెల్లాగ్ కాలేజీలో ‘సామాజిక అభివృద్ధి – మహిళా సాధికారత’ అంశంపై మమతా బెనర్జీ మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుంది.

Also Read: మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియోలు వైరల్.. ధాయ్ లాండ్ లో ఎమర్జెన్సీ

మమతా బెనర్జీ మాట్లాడుతుండగా కొందరు విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఆర్జీకర్ లో విద్యార్థిని హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. బెంగాల్ లో ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపైనా, సందేశ్ ఖలిలో మహిళలపై నేరాల గురించి ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు మమతా బెనర్జీ సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. అయితే, నిరసనకారుల నినాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Also Read: India : ఫారిన్ మోజుతో దేశాన్ని వీడుతున్న శ్రీమంతులు.. కోటక్‌ ప్రైవేట్‌ సర్వేలో షాకింగ్‌ వాస్తవాలు

ఆర్జీకర్ లో విద్యార్థిని హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. వీటికి మమత బెనర్జీ సమాధానం ఇస్తూ.. ఆ కేసు పెండింగ్ లో ఉందని మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. దాని దర్యాప్తు ఇప్పుడు మా చేతుల్లో లేదు. కేంద్రమే ఆ బాధ్యత తీసుకుందని అన్నారు. ‘ఇక్కడ రాజకీయాలు చేయకండి.. రాజకీయాలకు ఇది వేదిక కాదు. నేను దేశం తరపున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. ఇలా చేస్తే మీరు మన దేశాన్ని అవమానించిట్లే’’. మా రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను తెలుసుకోండి అంటూ బదులిచ్చారు.

Mamata Banerjee

నిరసనకారులు వెనక్కి తగ్గకపోవటంతో మమతా బెనర్జీ 1990ల నాటి ఓ ఫొటోను ప్రదర్శించారు. తీవ్రగాయాలతో తలకు కట్టుతో ఉన్న తన ఫొటోను చూపించారు. ముందు ఈ చిత్రాన్ని చూడండి. నన్ను చంపేందుకు ఎలాంటి కుట్రలు, యత్నాలు జరిగాయో తెలుసుకోండి అని అన్నారు. ఇలాంటి నిరసనలతో తనను భయపెట్టలేరని పేర్కొన్నారు. తాను రాయల్ బెంగాల్ టైగర్ అని అన్నారు. దీంతో సభలోని వారంతా చప్పట్లతో అభినందించారు. అనంతరం నిర్వాహకులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించవేశారు.