Mizoram: చిన్న రాష్ట్రమే అయినా చింతలేని రాష్ట్రమట.. ఇండియాలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తింపు
దీంతో పాటు కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, కొవిడ ప్రభావం, శారీరక, మానసిక ఆరోగ్యం అనే ఆరు అంశాలపై పరిశోధన చేశారు. ఈ అన్ని విషయాల్లో మిజోరాం రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది

Mizoram
Mizoram: ఈశాన్యంలో ఉన్న చిన్న రాష్ట్రం. ఎత్తైన కొండలు. పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ జనాల జాడ కనిపించని ప్రాంతం. మిజోరాం రాష్ట్రం.. భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఇదేనట. ప్రొఫెసర్ రాజేష్ కె పిలానియా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషంయ తేటతెల్లనైంది. ఆరు అంశాలపై జరిపిన పరిశోధన ఆధారంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాల ప్రజల కంటే మిజోరాం ప్రజలు అత్యంత సంతోషకరంగా ఉన్నారని తేల్చి చెప్పారు. మయన్మార్ సరిహద్దులో ఉంటే ఈ రాష్ట్రంలో అక్షరాస్యత 100 శాతం ఉంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థుల విద్య, అభివృద్ధికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని అధ్యయనంలో తెలిసింది.
Viral Video: ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ ప్రారంభించిన ఆవు
ఇక దీంతో పాటు కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, కొవిడ ప్రభావం, శారీరక, మానసిక ఆరోగ్యం అనే ఆరు అంశాలపై పరిశోధన చేశారు. ఈ అన్ని విషయాల్లో మిజోరాం రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మిజోరాం వాతావరణం చాలా బాగుంటుందని సర్వే చేసిన వారు తెలిపారు. రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి.. తన చిన్నతనంలోనే తన తండ్రి వదిలిపెట్టి వెళ్లడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. చాలా కష్టాల నడుమ చదువు రాణిస్తున్న ఆ విద్యార్థి.. తాను చార్టర్డ్ అకౌంటెంట్ లేదంటే సివిల్ సర్వీసెస్ రాస్తానని చెప్పాడు. మిగిలిన విద్యార్థుల లక్ష్యాలు కూడా ఇలాగే ఉన్నాయి. అంతటి ఆత్మవిశ్వాసానికి కారణం అక్కడి వాతావరణం, సదుపాయాలని అధ్యయనంలో తేలిందట.
Karnataka Polls: రాజకీయాలకు గుడ్ బై.. ఎన్నికల ముందు కీలక ప్రకటన చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య
మిజోరాంలో సామాజిక నిర్మాణం కూడా అక్కడి యువత ఆనందానికి దోహదం చేస్తుంది. తమ పెంపకంలో యువత సంతోషంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చసుకుంటారట. ‘‘మాది కుల రహిత సమాజం. అలాగే ఇక్కడ చదువుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువ” అని ప్రైవేట్ పాఠశాల టీచర్ ఒకరు చెప్పడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రతి బిడ్డ లింగ భేదం లేకుండా, ముందుగానే సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది. “మా ఉపాధ్యాయులు మాకు మంచి స్నేహితులు. ఎటువంటి సిగ్గు, బిడియం లేకుండా మా టీచర్లతో కలిసి పోయి వారితో ఏదైనా పంచుకుంటాం’’ అని ఒక విద్యార్థి చెప్పాడు. దీన్ని బట్టి అక్కడి విద్యా వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు. ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం ప్రధానంగా ఉంటుంది. ఇక వీరి తర్వాత హిందువులు ఆ తర్వాత ముస్లింలు ఎక్కువగా ఉంటారు. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు కలసి ఉంటాయి.