దేవుడా.. ఒక్కో ప్లాట్ ధర రూ. 500కోట్లు.. అది ఇల్లా.. స్వర్గమా.. ఇండియాలో ఎక్కడంటే..

Real Estate : ముంబైలో ఈ సంస్థ చేపట్టే నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటిగా నిలవనుంది.

దేవుడా.. ఒక్కో ప్లాట్ ధర రూ. 500కోట్లు.. అది ఇల్లా.. స్వర్గమా.. ఇండియాలో ఎక్కడంటే..

Updated On : September 30, 2025 / 2:54 PM IST

Real Estate : మహానగరాల్లో భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరానికి దగ్గరగా భూమి, అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనాలంటే భారీ ధరలు పలుకుతున్నాయి. అయితే, నగరంలో, నగర శివారు ప్రాంతాల్లో విలాసవంతమైన సదుపాయాలతో అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణం ఇటీవల కాలంలో పెరిగింది. అలాంటి ప్రాంతాల్లో ప్లాట్లు, విల్లా కొనుగోలు చేయాలంటే కొన్ని కోట్లు చెల్లించాల్సిందే. అయితే, అత్యంత విలాసవంతమైన ప్లాట్లు అయితే రూ.5 కోట్లు నుంచి రూ.10 కోట్ల వరకు ధరలు ఉంటాయి.. మహా అంటే.. రూ.20కోట్లు ఉండొచ్చు. కానీ.. ప్రధాన నగరాల్లో ప్లాట్ ధర ఏకంగా రూ.100 కోట్లు నుంచి రూ.500 కోట్లుకు చేరుతున్నాయి.

రెండు, మూడు అంతస్తులతో నిర్మిస్తున్న విల్లాలే కాకుండా.. అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్న అపార్టుమెంట్లలో ప్లాట్ల ధరలు హైదరాబాద్‌లోనూ రూ.10కోట్లకు మించినవి ఉన్నాయి. గురుగ్రామ్‌లో డీఎల్ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న కామెలియాస్ అపార్టుమెంట్లో ప్లాట్ ధర రూ.100 కోట్లు అయితే.. ఇప్పుడు సన్‌టెక్ రియాల్టీ నిర్మించబోతున్న అపార్ట్‌మెంట్లో ప్లాట్ ధర కనిష్టంగా రూ. 100 కోట్లు నుంచి గరిష్టంగా రూ.500 కోట్లు ఉంటుందట. ముంబైలోని నీపెన్సీ రోడ్‌తో పాటు, దుబాయ్ డౌన్‌టౌన్, బుర్జ్ ఖలీఫా కమ్యూనిటీలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ముంబైలో ఈ సంస్థ చేపట్టే నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటిగా నిలవనుంది.

సన్‌టెక్ రియాల్టీ ఇప్పుడు ఎమాన్సే అని సరికొత్త బ్రాండ్ ను పరిచయం చేసింది. ఇది విశాలం (Immense), విలాసం (Indulgence) అనే రెండు పదాల కలయికలో రూపొందించారు. ఇక్కడ ఎమాన్సే బ్రాండ్ కింద నిర్మితమయ్యే రెసిడెన్సీలు బై ఇన్వైట్ ఓన్లీ అనే పద్దతిలోనే విక్రయిస్తారు. ఎమాన్సే బ్రాండ్ పై అత్యంత విలాసవంతంగా నిర్మించబోయే ఈ నివాస సముదాయాలు ముంబయి, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఉంటాయని, ఈ రెండు ప్రాజెక్టులపైనే రూ. 20వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నాయని సన్‌టెక్ రియాల్టీ సంస్థ తెలిపింది.

వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుడతామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కుబేరులు, అత్యంత సంపన్నుల సంఖ్య దేశీయంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో చదరపు అడుగు నిర్మాణ వ్యయమే రూ.2.5 లక్షలకుపైగా ఉంటుందని అంచనా. ముంబైలో ఈ సంస్థ చేపట్టే అపార్ట్‌మెంట్ నిర్మాణాలు పూర్తయితే దేశంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటిగా నిలవనుంది.