స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది. 

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 07:30 PM IST
స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

Updated On : January 21, 2020 / 7:30 PM IST

స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది. 

స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మణిపూర్ అటవీశాఖ మంత్రి శ్యామ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రస్తుతం స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సుప్రీంకోర్టు సూచించింది. 

స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే అని పేర్కొంది. అనర్హత పిటిషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండాలని అభిప్రాయ పడింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ అధికారాలపై పార్లమెంట్ పున:సమీక్ష చేయాలని తెలిపింది. మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలో చేరిన శ్యామ్ కుమార్.. అటవీశాఖ మంత్రి పదవిని చేపట్టారు.

శ్యామ్ కుమార్ ను అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫజూర్ రహీమ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. నాలుగు వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ ఆధ్వర్యంలోని బెంచ్.. పిటిషనర్ కు సూచించింది.