సమయం లేదు మిత్రమా : రేపే బలపరీక్ష

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫడ్నవిస్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సిన ఆదేశించింది. రేపే(నవంబర్ 27,2019) బలపరీక్ష నిర్వహించాలని

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 05:20 AM IST
సమయం లేదు మిత్రమా : రేపే బలపరీక్ష

Updated On : November 26, 2019 / 5:20 AM IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫడ్నవిస్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సిన ఆదేశించింది. రేపే(నవంబర్ 27,2019) బలపరీక్ష నిర్వహించాలని

మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రేపే(నవంబర్ 27,2019) బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5గంటల లోపు ఫడ్నవిస్ సర్కార్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలంది. ఓపెన్ బ్యాలెట్ ద్వారానే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని, బలనిరూపణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు చెప్పింది. బలపరీక్ష ప్రక్రియ నిర్వహించడం కోసం వెంటనే ప్రొటెం స్పీకర్ ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం(నవంబర్ 26,2019) ఉదయం 10.30కి తీర్పు ఇచ్చింది. బల నిరూపణతోనే ఫడ్నవిస్ సర్కార్ కు ఎంత బలం ఉందనేది తెలుస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. బలపరీక్షపై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తుది తీర్పు ఇచ్చింది. ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యేలంతా రేపటిలోగా(నవంబర్ 27,2019) ప్రమాణస్వీకారం చేయాలని తెలిపింది. 

వాస్తవానికి నవంబర్ 30వ తేదీ వరకు బలనిరూపణ కోసం ఫడ్నవిస్ ప్రభుత్వానికి గవర్నర్ గడువు ఇచ్చారు. అయితే.. సుప్రీంకోర్టు మాత్రం రేపే బలపరీక్షకు ఆదేశించింది. 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో గెలిచింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉంది. ఇంకా 29మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంతమంది అజిత్ పవార్ వర్గం నుంచి వస్తారా అన్నది తేలాల్సిన అంశం. 

అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 144మంది సభ్యుల బలం ఉంది. కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎన్సీపీకి సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీపీలో రెబెల్స్ అంశం ఆందోళన కలిగిస్తోంది. చివరి నిమిషంలో ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారో అనే భయం శరద్ పవార్‌ను టెన్షన్ పెడుతోంది.