Maratha Reservations : మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మరాఠా రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరాఠా రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది. మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసింది.

Maratha Reservations : మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Quashes Maharashtra Law Granting Reservation To Maratha Community

Updated On : May 5, 2021 / 11:18 AM IST

Supreme Court quashes Maharashtra law : మరాఠా రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరాఠా రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది. మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసింది. మరాఠా రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని సుప్రీం కొట్టేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం వెల్లడించింది.

మరాఠాలు ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి లేరని సుప్రీం ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. రిజర్వేషన్ల కోసం 50 శాతం పరిమితిని ఏ రాష్ట్రంలోనూ మించరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఉద్యోగాలు, విద్యలో మరాఠాలకు రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టు స్పందించింది. జస్టిస్ అశోక్ భూషణ్ తన తీర్పులో మరాఠాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్న సవరణను తొలగించారు.

మరాఠాలకు విద్య, ఉపాధికి 13 శాతం రిజర్వేషన్లు ఇచ్చే సవరణను రద్దు చేసినట్లు సుప్రీం తెలిపింది. మహారాష్ట్ర మరాఠాలకు 13 శాతం వరకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లను 65 శాతానికి తీసుకుంది. మరాఠా రిజర్వేషన్ ఆధారంగా 2020 సెప్టెంబర్ 9 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇది వర్తించదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.