Param Bir Singh: పరమ్ బీర్ సింగ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
తనపై ఉన్న విచారణలన్నింటినీ మహారాష్ట్ర వెలుపల ఒక స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని కోరుతూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బిర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Supreme Court Refused Param Bir Singh Petition
Param Bir Singh: తనపై ఉన్న విచారణలన్నింటినీ మహారాష్ట్ర వెలుపల ఒక స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని కోరుతూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. 30 ఏళ్లపాటు మహారాష్ట్ర పోలీస్ సర్వీస్ లో కొనసాగి ఇప్పుడు రాష్ట్రం వెలుపల విచారణ జరిపించాలనడం మీరు పనిచేసిన పోలీస్ వ్యవస్థపైనే మీకు నమ్మకం లేనట్లు అవుతుందని కోర్టు తెలిపింది.
కాగా పరమ్ బీర్ సింగ్ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ నివాసం వద్ద బాంబు కేసు విచారణ సమయంలో ఇతడిపై కేసు నమోదైంది. ఇదే సమయంలో సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సంచలన ఆరోపణలు చేశారు పరమ్ బీర్ సింగ్. హోంమంత్రి ప్రతి నెల రూ. 100 కోట్లు ఇవ్వాలని తమను వేధిస్తున్నాడని ఆరోపించారు.
ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. హోంమంత్రి రాజీనామా తర్వాత పరమ్ బీర్ సింగ్ పై సస్పెన్షన్ ఎత్తేసి హోమ్ గార్డ్స్ విభాగానికి బదిలీ చేశారు.