Supreme Court : కుమారి, శ్రీమతి అంటే తప్పేంటి? – సుప్రీంకోర్టు

పేరుకి ముందు శ్రీమతి, కుమారి అనే పదాలు అడగొద్దు.. అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పదాల ఎంపిక వారి ఇష్టాన్ని అనుసరించి ఉంటుందని.. దానిని నియంత్రించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టి పారేసింది సుప్రీంకోర్టు.

Supreme Court : కుమారి, శ్రీమతి అంటే తప్పేంటి? – సుప్రీంకోర్టు

supreme court

Updated On : May 16, 2023 / 1:23 PM IST

Supreme Court dismissed the petition : పెళ్లి కాని ఆడవారిని కుమారి.. అని పెళ్లైన వారిని శ్రీమతి అని సంభోదిస్తారు. అయితే పేరుకి ముందు ఇలాంటి పదాలు పెట్టుకోవాలని ఏ మహిళను అడగకూడదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Mohammed Shami Wife: నా భర్తను అరెస్టు చేయండి.. వివాహేతర సంబంధాలున్నాయి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీన్ జహాన్ 

ఆడవారు తమ పేరుకి ముందు మిస్, కుమారి, మిసెస్ లాంటి పదాలు పెట్టుకోవద్దు అని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిని పరిశీలించిన ఎస్.కే.కౌల్, ఎ.అమానుల్లాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ పదాలు ఉపయోగించడం వారి వ్యక్తిగత విషయమని పేర్కొంది. ఈ పిటిషన్ కేవలం ప్రచారం కోసం చేస్తున్నట్లుగా ఉందని ధర్మాసనం వెల్లడించింది. ఈ పదాలు వాడాలని ఎవరైనా అనుకుంటే వారిని ఎలా నిరోధించగలుగుతాం అని బెంచ్ ప్రశ్నించింది.

Divorce : విడాకులపై సుప్రీంకోర్టు తీర్పుతో హిందూ వివాహ వ్యవస్థపై సరికొత్త చర్చ.. ఆ వాదన కరక్టేనా!?

ఇక ఇదే అంశంపై పిటిషనర్ తరపు న్యాయవాది మరిన్ని పత్రాలను సమర్పించాలని అనుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. అందుకు కోర్టు తిరస్కరించింది.