కేంద్రం వలస కార్మికులను 15రోజుల్లోగా వెనక్కు పంపాలి: సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు వలస కార్మికులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా ఇన్ని రోజులుగా పనిలేకుండా ఉన్న వారిని సొంత రాష్ట్రాలకు 15రోజులుగా పంపాలని ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు వలస కార్మికుల అంశంపై విచారణ జరిపి 24గంటల్లోగా రైళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
కోర్టు డైరక్షన్లు పాటించి రిజిస్ట్రేషన్ ప్రకారం.. వలస కార్మికులను గుర్తించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్కీం ప్రకారం.. వలస కార్మికులకు సాయం చేయాలని తెలిపింది. వలస కార్మికులను తిరిగి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించింది.
కేంద్రం, రాష్ట్రాలు వలస కార్మికులను గుర్తించడంలో ఓ లిస్ట్ తయారుచేసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ రిలీఫ్ ప్రకటిస్తూనే, స్కిల్ ను బట్టి వారిని తిరిగి తీసుకురావాలని భావిస్తుంది. శుక్రవారంతో చివరి వాదన పూర్తవువతుండగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు చాలా మంది వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వచ్చేందుకు సుముఖంగా లేరని చెప్తున్నాయి.
Read: జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఆఫీస్‌కు రావొద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు