శబరిమల ఆలయంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

శబరిమల ఆలయ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిర్వాహణకు కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయాలని, గతంలో చెప్పినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం విచారణ జరిపి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 03వ వారంలో కొత్త చట్టం ఏర్పాటు చేసి కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఆలయ నిర్వాహణ విషయంలో టీటీడీ బోర్డు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని తెలిపింది.
శబరిమల ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రధానంగా నవంబర్, డిసెంబర్ మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి అయ్యప్పను దర్శించుకుంటుంటారు. అయితే..2011లో ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం సీరియస్ అయ్యింది. ఇంత పెద్ద ఎత్తున్న భక్తులు ఇక్కడకు వస్తున్నా..కొత్త చట్టం ఎందుకు తీసుకరావడం లేదని ప్రశ్నించింది.
భారీ ఎత్తున్న వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అయ్యప్ప దేవాలయాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని సూచించింది. మహిళలకు ఆలయ ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పు వర్తిస్తుందని వెల్లడించింది. అంతేగాకుండా..మూడు వేల ఆలయాలకు ఒకే ఐఏఎస్ ఉండడంపై ప్రశ్నించింది. ఒక్కో దేవాలయానికి ఒక ఐఏఎస్ ఉండాలని సూచించింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై కేరళ సర్కార్ కొత్త చట్టం తీసుకొస్తుందా ? లేదా ? అనేది చూడాలి.
Read More : రాజ్యసభ సమావేశాలు : కాశ్మీర్‌పై షా స్టేటస్ రిపోర్టు