Modi Gold Bust: ప్రధాని మోదీ బంగారు ప్రతిమను రూపొందించిన గుజరాత్ నగల వ్యాపారి

మోదీ ప్రతిమకు ఉపయోగించిన బంగారం విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందట. ఇకపోతే, ఇలాంటి బంగారు ప్రతిమలు తయారు చేయించడం బోహ్రాకు ఇది కొత్తేం కాదు. గతంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్ విగ్రహం) ప్రతిమను రూపొందించారు. మొదట అమ్మకం గురించి స్పష్టం చేయనప్పటికీ, కొద్ది రోజులకు అమ్మేశారు.

Modi Gold Bust: ప్రధాని మోదీ బంగారు ప్రతిమను రూపొందించిన గుజరాత్ నగల వ్యాపారి

Surat Jeweller Carves PM's Gold Bust

Updated On : January 20, 2023 / 9:20 PM IST

Modi Gold Bust: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‭కు చెందిన ఒక నగల వ్యాపారి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగారు ప్రతిమను రూపొందించారు. గతేడాది డిసెంబరులో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఈ ప్రతిమను రూపొందించినట్లు రాధికా చైన్స్ జ్యూవెల్లరీ యజమాని బసంత్ బోహ్రా. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 సీట్లు గెలుచుకుంది. దీనికి గుర్తుగా 156 గ్రాముల బంగారంతో ఈ ప్రతిమను రూపొందించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ప్రతిమను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపించారని, అయితే అది అమ్మాలా లేదా అనేది ఇప్పటి వరకు నిర్ణయించలేదని బోహ్రా పేర్కొన్నారు.

BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ.. పోలీస్ కేసు ఫైల్ చేసిన సుప్రీం లాయర్

ఈ విషయమై బోహ్రా మాట్లాడుతూ ‘‘నేనేమీ నరేంద్రమోదీకి అభిమానిని కాదు. నేనేమీ మోదీకి బహుమానం ఇవ్వాలనుకోవడం లేదు. కాకపోతే ఎందుకో అలా రూపొందించాలని అనిపించింది. అందుకే రూపొందించాను. దీని కోసం 20 మంది కళారులు మూడు నెలల పాటు కష్టపడ్డారు. చివరి ఆకృతి వచ్చేటప్పటికీ నేను సంతృప్తి చెందాను. ఇప్పటికైతే ఇది అమ్మాలని అనుకోలేదు. అందుకే దీనిపై ప్రైజ్ ట్యాగ్ లేదు’’ అని బోహ్రా అన్నారు. వాస్తవానికి ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. చాలా కాలం క్రితం సూరత్ వచ్చి, అక్కడే సెటిల్ అయ్యారు.

Gehlot vs Pilot: ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎంతకీ తగ్గని గెహ్లాట్, పైలట్.. మరోసారి మాటల యుద్ధంతో కాంగ్రెస్‭లో కలవరం