కొత్త ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర

కేంద్ర ఎన్నికల కమిషనర్ గా (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 14, 2019) న్యాయ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

  • Published By: sreehari ,Published On : February 14, 2019 / 01:52 PM IST
కొత్త ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర

Updated On : February 14, 2019 / 1:52 PM IST

కేంద్ర ఎన్నికల కమిషనర్ గా (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 14, 2019) న్యాయ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కేంద్ర కొత్త ఎన్నికల కమిషనర్ గా (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 14, 2019) న్యాయ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఐటీ గ్రాడ్యువేట్ పూర్తిచేసిన సుశీల్ భారత రెవెన్యూ సర్వీసు (ఆదాయ పన్ను కేడర్)కు చెందిన 1980వ బ్యాచ్ అధికారి.

2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సుశీల్ చంద్రను కేంద్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడంపై చర్చనీయాంశమైంది. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, అశోక్ లావాసాతో పాటు చంద్ర కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

తాజా నియామకంతో సుశీల్ చంద్ర పోల్ ప్యానెల్ లో రెండో ఎన్నికల కమిషనర్ గా విధుల్లో చేరనున్నారు. 2016, నవంబర్ 1న సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చీఫ్ గా చంద్ర నియమితులయ్యారు. ఈ ఏడాదిలో పదవీకాలాన్ని ఏడాది వరకు (మార్చి 31) వరకు పొడిగించారు.

కేంద్ర ఎన్నికల సంఘంలో పోల్ ప్యానెల్.. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తుంటాయి. వచ్చే కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు ఎన్నికల కమిషన్ భావిస్తోంది.