Delhi Covid : కరోనా ఉందని తండ్రిని వెళ్లగొట్టాడు…ఆదుకున్న కానిస్టేబుల్

కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు.

Delhi Covid : కరోనా ఉందని తండ్రిని వెళ్లగొట్టాడు…ఆదుకున్న కానిస్టేబుల్

Salute To Delhi Police

Updated On : April 18, 2021 / 8:16 PM IST

Gasping Condition: కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..

కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో వైరస్‌ సోకిన వారిని అంటరాని వారిని చూసినట్టు చూసేవారు.. కానీ ఇప్పుడు కాలం మారింది.. వైరస్‌పై అవగాహన పెరిగింది.. కరోనా సోకితే అదేదో అనర్థాలు జరుగుతాయన్న భయాలు లేవు… కానీ..కొంతమంది మాత్రం ఇంకా..ఏదో జరిగిపోతుందన్నట్లు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఆదుకుని అండగా ఉండి.. గుండెధైర్యం చెప్పాల్సిన వాళ్లే.. అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారివల్లే.. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మురళీధరన్ రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 2021, ఏప్రిల్ 18వ తేదీ ఆదివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీనిని గమనించిన అతని కొడుకు..ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఎక్కడ కరోనా సోకిందేమోనన్న భయం వల్లే ఇలా చేశాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రాజు గమనించాడు.

వెంటనే అతడిని RML ఆసుపత్రికి తీసుకొచ్చి..అడ్మిషన్ కల్పించాడు. అతనికి స్వయంగా..దగ్గరుండి మంచినీళ్లు ఇప్పించాడు. కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొడుకు నిర్వాకంపై మండిపడుతున్నారు. ఈ విషయాన్ని Hemant Rajaura అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అతనికి ఆక్సిజన్ అందడం లేదని, వెంటనే డాక్టర్లు స్పందించి చికిత్స అందించాలని అతను కోరారు.

Read More :  Punjab : లక్కున్నోడు..రూ. 100 లాటరీతో కోటీశ్వరుడైన కూలీ!