Tamil Nadu : పోలీసులకు వీక్లీ ఆఫ్

వీక్లీ ఆఫ్ అమలు చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లక్ష మంది వరకు పోలీసులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు.

Tamil Nadu : పోలీసులకు వీక్లీ ఆఫ్

Tamilnadu

Updated On : November 4, 2021 / 10:22 AM IST

Tamil Nadu Police : పోలీసులు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించడం వల్లే శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నాయి. అయితే..వీరికి కొన్ని రాష్ట్రాల్లో వీక్లీ ఆఫ్ ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వీరి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. వీక్లీ ఆఫ్ అమలు చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లక్ష మంది వరకు పోలీసులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు.

Read More : Yahoo Out : చైనాకు షాక్.. ఇకపై మాదారి మాది.. యాహూ గుడ్‌బై!

అయితే..కొంతమంది పని ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆయా జిల్లాలో వారంలో ఏదో ఒక రోజు సెలవుతో పాటు..వివాహ, బర్త్ డే రోజుల్లో అనధికారికంగా సెలవు ఇచ్చేవారు. ఇది ఆచరణలో విఫలం అవుతుండేది. ఈ పరిస్థితుల్లో వారికి వీక్లీఆఫ్ ఇవ్వడం సరైందేనని సీఎం స్టాలిన్ భావించారు. విధులను పక్కన పెట్టి..కుటుంబంతో సంతోషంగా ఆ ఒక్క రోజు గడిపేందుకు…వీలుగా వీక్లీఆఫ్ అమలుకు సిద్ధమయ్యారు. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లకు వారంలో ఒక రోజు వీక్లీఆఫ్ తీసుకొనే అవకాశం కల్పించారు. సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయానికి పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Australia : చిన్నారి కిడ్నాప్, దేశం మొత్తమే ప్రార్థించింది..18 రోజుల తర్వాత

మరోవైపు..బ్రిటీష్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూట్ కంట్రోల్ రూమ్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ ను అందచేసింది. ఈ సర్టిఫికేట్ ను బుధవారం సీఎం స్టాలిన్ చేతుల మీదుగా డీజీపీ శైలేంద్ర బాబు, హోం శాఖ కార్యదర్శి ప్రభాకర్ లు అందుకున్నారు. చెన్నై డీజీపీ కార్యాలయం ఆవరణలో ప్రజల సౌకర్యార్థం..ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసేందే. ఈ సంవత్సరంలో 1.12 కోట్ల ఫిర్యాదులు రావడం..వాటికి పరిష్కారం చూపడంతో…రికార్డు ఎక్కింది.