TN CM Vijay – MK Stalin: క్యా సీన్ హై.. మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లిన సీఎం విజయ్.. ఆలింగనం చేసుకుని మరీ ఆహ్వానం
మాజీ సీఎం స్టాలిన్ ను ముఖ్యమంత్రి విజయ్ కలవటం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఘట్టం తమిళనాడు రాజకీయాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది.
TN CM Vijay – MK Stalin: తమిళనాడు సీఎం విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా స్టాలిన్ ను కలిశారు విజయ్. గేటు దగ్గరే విజయ్ ను ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు ఉదయనిధి స్టాలిన్. డోర్ దగ్గరి నుంచి విజయ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం విజయ్ ను అప్యాయంగా పలకరించారు. విజయ్ ను ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారు. స్టాలిన్, విజయ్ పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. డీఎంకే మిత్రపక్షాలతో విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్ ఇంటికెళ్లారు విజయ్. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టాలిన్ ఇంటికెళ్లారు విజయ్.
మాజీ సీఎం స్టాలిన్ ను ముఖ్యమంత్రి విజయ్ కలవటం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఘట్టం తమిళనాడు రాజకీయాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. సీఎంగా తన లుక్ మాత్రమే కాదు తన వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని విజయ్ చూపిస్తున్నారు. హీరోగా తనకున్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకుండా సీఎంగా కూడా అదే ఫాలోయింగ్ మెయింటైన్ చేసేలా విజయ్ వ్యవహారశైలి కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు తమిళనాడు పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో తన రెండు ప్రత్యర్థి పార్టీలపై పరుష పదజాలం వాడకుండా జాగ్రత్త పడిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలవడం అరవ రాజకీయాల్లో కొత్త దృశ్యం. అయితే అన్నాడీఎంకే లేదంటే డీఎంకే మాత్రమే గెలుస్తూ వచ్చిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన జయలలిత, కరుణానిధి మధ్యన సఖ్యత లేదు. అలాంటి చోట ఇప్పుడు ఈ డెవలప్ మెంట్ ప్రతీకార రాజకీయాలకు తెర దించింది. టీవీకే కొత్త పార్టీ కాబట్టి ఈ దృశ్యాలు కనిపించాయి అనేందుకు లేదు. మొదటి నుంచి కూడా విజయ్ డీఎంకే, అన్నాడీఎంకే నేతలతో సమ దూరం పాటించారు. అంతే కాదు అదే సమాన సఖ్యతతో మెలిగారు. అదే ఇప్పుడు దీనికి దోహద పడిందని చెప్పాలి.
Also Read: విజయ్ సీఎం అయ్యాక.. త్రిషకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. ఏకంగా 12 కోట్లు..
