Tamil Nadu : రూ.3 తగ్గిన పెట్రోల్ ధర !
పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడంతో ప్రజలపై భారం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి పళినివేల్ త్యాగరాజన్ వెల్లడించారు.

Tamil Nadu
Tamil Nadu : దేశంలో పెట్రోల్ ధరలు మండిపడుతున్నాయి. గత 28 రోజులుగా ధరలు పెరగనప్పడికి అంతకు ముందు ఉన్న ధరలే ప్రజలకు భారంగా ఉన్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు రూ.100 దాటింది. ఇక డీజిల్ రేటు కూడా రూ.100కు చేరువలో ఉంది.
ఇక ఈ నేపథ్యంలోనే ప్రజలపై పెట్రోల్ భారం తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.3 మేర వ్యాట్ తగ్గింస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పళినివేల్ త్యాగరాజన్ వెల్లడించారు. వ్యాట్ తగ్గించడం వలన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో రూ1160 కోట్లకు గండి పడుతుంది.
అయిప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం ధర తగ్గించినట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.49గా ఉంది. మూడు రూపాయలు తగ్గించడంతో వందకు దిగువకు చేరింది. ఇక తమిళనాడు సర్కార్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.