Cancel NEET 2022: నీట్ రద్దు బిల్లు తిరస్కరించిన తమిళనాడు గవర్నర్

నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రబుత్వం పెట్టిన బిల్లును తిరస్కరించారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. నీట్ పరీక్ష నుంచి రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు కావాలని....

Cancel NEET 2022: నీట్ రద్దు బిల్లు తిరస్కరించిన తమిళనాడు గవర్నర్

Neet Bill

Updated On : February 3, 2022 / 9:50 PM IST

Cancel NEET 2022: నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రబుత్వం పెట్టిన బిల్లును తిరస్కరించారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. నీట్ పరీక్ష నుంచి రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు కావాలని సెప్టెంబరులో అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదం కోసం స్టాలిన్ సర్కారు ప్రయత్నించింది.

ప్రభుత్వం సిద్ధం చేసిన బిల్లు గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా ఉందని గవర్నర్ తిరస్కరించారు. ఈ మేరకు నీట్ రద్దు బిల్లును వెనక్కి పంపుతున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

గవర్నర్ నిర్ణయంతో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్టాలిన్ సర్కార్ కు భంగపాటు ఎదురైంది.

Read Also: మొట్టమొదటి సొంత ఇంటికి అమ్మేసిన అమితాబ్!

ఇదిలా ఉంటే, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ రాజకీయ పార్టీలకు సంబంధించిన 37 మంది నేతలకు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు 36 మంది కీలక నేతలకు ఆయన లేఖలు రాశారు.

మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, ‘ఆల్ ఇండియా సోషల్ జస్టిస్’ వేదికలో తమ పార్టీకి సంబంధించి నేతలను చేర్చుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్త్తి చేశారు.